38.2 C
Hyderabad
April 25, 2024 14: 26 PM
Slider ప్రత్యేకం

వదల బొమ్మాళీ: ఏపి ఆర్ధిక స్థితిపై ప్రధానికి రఘురామ ఫిర్యాదు

#raghurama

ఆర్ధికంగా పూర్తిగా దివాలా తీసిన ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలలో కేంద్రం జోక్యం చేసుకుని ప్రజల ఆస్తులను కాపాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ప్రజా సంక్షేమం ముసుగులో వ్యక్తిగత లబ్ధి నెరవేర్చుకునే విధానం ఏపిలో కనిపిస్తోందని రఘురామకృష్ణంరాజు ఆక్షేపించారు.

ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కొట్టుమిట్టాడుతోందని లేఖలో ఆయన పేర్కొన్నారు. స్థోమతకు మించి అప్పులు చేసి అప్పుల ఊబిలోకి పోయిందని ఆయన ప్రధానికి వివరించారు. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు అయిన జిల్లా కలెక్టరేట్లు, తాసిల్దార్ కార్యాలయాలు అమ్ముకునే దీన స్థితికి ఆంధ్రప్రదేశ్ వచ్చిందని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీఎస్‍డీసీకి ప్రభుత్వ ఆస్తులు బదలాయించి బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారని ఇందుకు ప్రభుత్వ భూముల తనఖా కార్యక్రమం చేపట్టారని ఆయన అన్నారు.  ఇప్పటికే పలు బ్యాంకుల నుంచి ఈ సంస్థ రూ.10 వేల కోట్లు అప్పుతీసుకుందని ఆయన వివరించారు.  

ఉచిత పథకాల అమలుకు మరో రూ.3 వేల కోట్లు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారని రఘురామకృష్ణంరాజు వివరించారు. విశాఖపట్నంలో 2200 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన లూలూ గ్రూప్ కు ప్రభుత్వం 13.59 ఎకరాలు కేటాయించగా దాన్ని వెనక్కి తీసుకుంటున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

స్థానికంగా 7700 మందికి ఉపాధి లభించడమే కాకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే ఈ కంపెనీని రాకుండా చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ భూమిని కూడా ఏపి ప్రభుత్వం అమ్ముకుంటున్నదని ఆయన ప్రధానికి వివరించారు.

ఎఫ్‍ఆర్‍బీఎం పరిమితికి మించి అప్పులు చేశారని, సుమారు రూ.35 వేల కోట్లకుపైగా అప్పులకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

‘‘2020లో సగటున ప్రతి నెలా సుమారు రూ.9,226 కోట్లు అప్పు చేశారు. ఉచిత పథకాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.13 వేల కోట్లు అప్పు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ఏపీ ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పింది. కేంద్రం జోక్యం చేసుకుని ఏపీ ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెట్టాలి’’ అని ఆయన కోరారు.

Related posts

డిసెంబర్ లో సెట్స్ కి వెళ్తున్న “డ్యూడ్”

Satyam NEWS

నడ్డా, అమిత్ షాని అరెస్టు చేస్తారా…?!

Bhavani

రోడ్డెక్కి ముగ్గులేసిన మాస్టర్ ప్లాన్ బాధిత రైతు కుటుంబాలు

Satyam NEWS

Leave a Comment