24 C
Hyderabad
June 19, 2021 09: 46 AM
Slider ప్రత్యేకం

రఘురామతో సయోధ్యకు నలుగురు ఎంపిల రాయబారం?

#Raghurama

జాతీయ స్థాయిలో రఘురామకృష్ణంరాజు చేస్తున్న డ్యామేజిని ఎలా ఎదుర్కోవాలో తెలియక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తికమకపడుతున్నది. ఇంతకాలం రచ్చబండ పేరుతో పార్టీ ఇమేజిని తెలుగు రాష్ట్రాలలో డ్యామేజి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ఇప్పుడు జాతీయ స్థాయిలో చేస్తున్న ప్రచారం వారికి మింగుడుపడటం లేదు.

రఘురామకృష్ణంరాజు ను ఏపి సిఐడి పోలీసులు దేశ ద్రోహం కేసు పెట్టి అరెస్టు చేయడం, ఆ తర్వాత లాకప్ లో హింస పెట్టినట్లు పూర్తి స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు బెయిల్ పై విడుదల అయిన నాటి నుంచి రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రచ్చబండ వంటి కార్యక్రమాల జోలికి వెళ్లడం లేదు.

తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఆయన అందరికి లేఖలు రాస్తున్నారు. రాష్ట్రపతి నుంచి మొదలుగుకి ప్రతి రాజ్యాంగ వ్యవస్థకు ఆయన లేఖలు రాస్తున్నారు. తాజాగా గవర్నర్లకూ లేఖలు రాశారు. ఏపీ సీఐడీ అధికారులు థర్డ్ డిగ్రీ ఉపయోగించారని, రాజద్రోహం కేసు మోపారని ఆరోపించారు. రాజద్రోహం సెక్షన్ 124(A)ను తొలగించాలని కోరారు.

జగన్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో లోటుపాట్లను ఎత్తిచూపితే వాటిని సరిదిద్దుకోకుండా తనపై కక్షగట్టి కేసులు మోపి హింసించారని ఆయా లేఖల్లో చెబుతున్నారు. ఈ విధంగా రఘురామకృష్ణరాజు రాస్తున్న లేఖలు, చేస్తున్న ఫిర్యాదులు పార్టీ ఇమేజిని జాతీయ స్థాయిలో తీవ్రంగా డ్యామేజి చేస్తున్నాయి.

రఘురామకృష్ణరాజు ను ఎలా కట్టడి చేయాలో తెలియని పార్టీ పెద్దలు ముందుగా తమ సోషల్ మీడియా ఎదురుదాడిని నిలిపివేశారు. అంతకు ముందు రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడినా విగ్గు రాజు అంటూ పేరు పెట్టి సోషల్ మీడియాలో అత్యంత నీచమైన భాషలో వ్యాఖ్యానాలు చేసే సోషల్ మీడియా టైగర్లు ఇప్పుడు సైలెంటుగా ఉన్నారు.

అంతకు ముందు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనే… సోషల్ మీడియా డైరక్టర్ పేరుతో ప్రభుత్వ జీతం తీసుకుంటూ… వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్‌గా వ్యవహరించే… వ్యక్తి.. రఘురామపై బూతులతో దాడి చేసేవారు.

ఇప్పుడు అతన్ని కూడా సైలెంట్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఇంతటితో ఆగుతారనుకున్న రఘురామకృష్ణరాజు ఆగకపోవడంతో రఘురామ లేఖలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని కొందరు నేతలు వైసీపీ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్ళారు.

ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజును సైలెంట్ చేసేందుకు వైసీపీ హైకమాండ్ నలుగురు ఎంపీలకు బాధ్యతలిచ్చినట్లు తెలిసింది. ప్రత్యేక విమానంలో వారిని ఢిల్లీకి పంపింది. ఇప్పటి వరకూ చేస్తున్న రచ్చతోనే.. చాలా వరకూ.. ఇమేజ్ డ్యామేజ్ అయిందని.. ఇక ముందు ఆయన నోరు తెరవకుండా ఉండాలంటే ఏం చేయాలో… చెప్పి వారికి దిశానిర్దేశం చేసి పంపారని తెలిసింది.

అమిత్ షా, రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్ అపాయింట్ మెంట్లను వెంటనే తీసుకోవాలని నిర్దేశించారు. వీరితో పాటు… రఘురామ లేఖలు రాస్తే స్పందించిన వారినందర్నీ వైసీపీ నేతలు ప్రత్యేకంగా కలిసి.. తమ వెర్షన్ వినిపించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

వీలైనంత వరకూ… రఘురామరాజుపై ఒత్తిడి తెచ్చి..ఆయన సైలెంటయ్యేలా చూడాలని.. రకరకాల ప్లాన్లు అమలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

Related posts

కంట్రోల్ కరెన్సీ:చైనా సర్కారు కీలక నిర్ణయం

Satyam NEWS

మరో యువతిపై ఇంట్లోనే అత్యాచార యత్నం

Satyam NEWS

పవిత్ర ఉగాది

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!