36.2 C
Hyderabad
April 16, 2024 19: 39 PM
Slider ప్రత్యేకం

రఘురామ డౌట్: కోర్టు విషయం సాక్షి ముందే ఎలా చెప్పింది?

#raghurama

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు జరుగుతుండగానే సాక్షి పత్రిక తన ట్విట్టర్ ఖాతాలో పిటిషన్ కొట్టేసినట్లు వార్తను ఉంచడంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.

న్యాయ వ్యవస్థ ను అపహాస్యం పాలు చేసే విధంగా ఈ ట్విట్ ను ఎలా ఉంచారు? ఎవరు ఉంచారు? వారికి ఎవరు తప్పుడు సమాచారం ఇచ్చారు అనే అంశాలపై కూలంకషంగా దర్యాప్తు జరిపించాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. న్యాయమూర్తి తీర్పు చెప్పడానికన్నా ముందే పిటిషన్ కొట్టేసినట్లు ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.

కోర్టు నుంచి ఆ మేరకు ఏమైనా సమాచారం అందిందా? లేక పార్టీ కార్యాలయం నుంచి సమాచారం వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. ఈ రెండూ కాకపోతే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్ చేసి సాక్షికి చెప్పారా అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని రఘురామకృష్ణంరాజు కోరారు.

ఆంధ్రప్రదేశ్ పోలీసుల ద్వారానే విచారణ జరిపించాలని అయితే సీఐడి పోలీసులతో మాత్రం విచారణ జరిపించవద్దని ఆయన అన్నారు. సీఐడి పోలీసులు సుమోటోగా తీసుకునే కేసులతో ఇప్పటికే పని భారంతో ఉన్నందున మరెవరైనా నిజాయితీగల అధికారితో సాక్షి ఈ విధంగా ముందుగానే ట్విట్ ఎందుకు పెట్టిందో విచారణ జరపాలని రఘురామ కోరారు.

న్యాయమూర్తి ఒక వేళ పిటిషన్ ను తిరస్కరించి ఉన్నట్లయితే సాక్షికి ముందే ఎలా తెలిసిందా అనే ప్రశ్న తలెత్తేదని, తద్వారా న్యాయ వ్యవస్థ పైన సామాన్య ప్రజలకు పలు అనుమానాలు రేకెత్తి ఉండేవని రఘురామ అన్నారు. గొడ్డలి పోటును గుండెపోటుగా ప్రచారం చేసిన వారు ఈ పిటిషన్ కొట్టివేత ట్విట్టర్ వెనుక కూడా ఉన్నారా అనే సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు.

అలాగే ఇది మీడియా మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం అని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థను అల్లరి చేయడం కోసం దీన్ని ప్లాన్ చేసినట్లుగా భావించాల్సి ఉంటుందని కూడా ఆయన తెలిపారు. ఇది ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి అప్రదిష్ట అని, అందువల్ల ఆయన పోలీసులతోనే విచారణ జరిపించాలని రఘురామ కోరారు.

Related posts

ఈ వాన కాలం లోపే మన చెరువులు నింపుకుందాం

Satyam NEWS

డ్రైనేజి పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Satyam NEWS

నటుడు శివాజీపై లుకౌట్ నోటీసులు తొలగింపు

Satyam NEWS

Leave a Comment