34.2 C
Hyderabad
April 23, 2024 14: 17 PM
Slider సినిమా

రౌద్రం రణం రుధిరం మోషన్ పోస్టర్ విడుదల

rajamouli RRR

శార్వరి నామ సంవత్సరం ఉగాది సందర్భంగా రాజమౌళి భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ టైటిల్ పై వివరణ ఇచ్చారు. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి RRR(రౌద్రం రణం రుధిరం)  అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు.

ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరంభీంగా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌, ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు.

ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని  డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.

Related posts

బీఆర్ఎస్ పార్టీలో చేరిన రాగిడి లక్ష్మారెడ్డి

Satyam NEWS

హైదరాబాద్ లో అమెజాన్ వచ్చింది నావల్లే

Satyam NEWS

ముస్లిం సోదరుడి వివాహానికి ఓజో ఫౌండేషన్ చైర్మన్ రఘు చేయూత

Satyam NEWS

Leave a Comment