26.2 C
Hyderabad
September 9, 2024 16: 30 PM
Slider తెలంగాణ

బాండ్ల ద్వారా రూ. 100 కోట్లు సేకరించిన బల్దియా

mayour bonthu

మూడవ విడతలో వంద కోట్ల రూపాయలను బాండ్ల రూపంలో సేకరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరోసారి రికార్డు సృష్టించింది. దేశంలోనే బాండ్ల ద్వారా నిధులను సేకరించిన తొలి మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి. వరుసగా మూడోసారి రూ. 100 కోట్ల సేకరణకు ముంబాయి స్టాక్ ఎక్స్ చేంజ్ లో బిడ్డింగ్ కు వెళ్లి నియమిత సమయం కన్నా ముందుగానే విజయవంతంగా వంద కోట్లు సేకరించింది. తద్వారా వరుసగా మూడు సార్లు విజయవంతంగా బాండ్ల ద్వారా నిధులను సేకరించి ఏకైక కార్పొరేషన్ గా జిహెచ్ఎంసి నిలిచింది. అయితే నేడు రూ. 300 కోట్లకు బిడ్డింగ్ నిర్వహించాలని జిహెచ్ఎంసి నిర్ణయించినప్పటికీ స్టాక్ మార్కెట్ లో ఏర్పడ్డ ఒడిదుడుకుల నేపథ్యంలో కేవలం వంద కోట్ల రూపాయల సేకరణకు మాత్రమే వెళ్లాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది. మంగళవారం నాడు ఉదయం 11:30 గంటల నుండి 12:30 వరకు బిడ్డింగ్ లో పాల్గొనడానికి ముంబాయి స్టాక్ ఎక్స్ చేంజ్ బిడ్డర్లకు అవకాశం కల్పించింది. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, జిహెచ్ఎంసి కమిషనర్ ఎం.దానకిషోర్, రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ సలహాదారు జయశ్రీ, జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్లు సిక్తాపట్నాయక్, కెనడి, ఎస్.బి.ఐ కార్ఫ్స్, బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ ప్రతినిధులు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని  కమాండ్ కంట్రోల్ రూం ద్వారా బిడ్డింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. బిడ్డింగ్ ప్రారంభమైన ఉదయం 11:30గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటలలోపు మరో 15 నిమిషాల సమయం ఉండగానే దాదాపు ఐదు సంస్థలు కలిపి మొత్తం రూ. 100 కోట్లకు బిడ్ లను దాఖలు చేశారు. బ్యాంకులు అందజేసే రుణాల వడ్డీ కన్నా తక్కువగా కేవలం 8.93శాతం వార్షిక వడ్డీతో ఈ వంద కోట్ల రూపాయలను జిహెచ్ఎంసి నేడు సేకరించగలిగింది. ఇప్పటికే గత రెండు విడతలుగా రూ. 395 కోట్లు బాండ్ల ద్వారా సేకరించింది. గ్రేటర్ హైదరాబాద్ లో సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థ (ఎస్.ఆర్.డి.పి)లో భాగంగా చేపడుతున్న ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, వంతెనల నిర్మాణానికి బాండ్ల ద్వారా సేకరించిన నిధులను వినియోగించుకోనున్నట్టు నగర మేయర్ రామ్మోహన్ ప్రకటించారు.

Related posts

రెండో అధికార భాష గా ఉర్ధూ

Sub Editor 2

ప్రతి కుటుంబానికి సంక్షేమ తోడ్పాటు

Bhavani

నిండుకుండల్లా మారిన అన్ని జలాశయాలు

Satyam NEWS

Leave a Comment