32.2 C
Hyderabad
April 20, 2024 19: 42 PM
Slider కడప

ప్రజారోగ్య భద్రతే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం

#Minister Alla Nani

రాష్ట్రంలో ప్రజారోగ్య భద్రతే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని, కోవిడ్ నివారణకు వేల కోట్లు వెచ్చిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ఎస్.బి.అంజద్ బాషలు  పేర్కొన్నారు. కడప కలెక్టరేట్ స్పందన హాల్ లోకోవిడ్ -19 పై మంత్రి డా.ఆదిమూలపు సురేష్ లతో కలిసి జిల్లా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎంపి వై.ఎస్.అవినాష్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి,  జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్, ఎస్పీ అన్బు రాజన్,  జేసి (రెవిన్యూ) గౌతమి, జేసి (అభివృద్ధి) సాయికాంత్ వర్మ, ఇంచార్జి డిఆర్ఓ సతీష్ చంద్ర, జిల్లా వైద్యాధికారులు తదితరులు హాజరయ్యారు.

కరోనాపై నెలకు 350 కోట్లు ఖర్చు

సమీక్ష అనంతరం  ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి నెలా 350 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో.. త్వరితగతిన కోవిడ్ కేసులను గుర్తించడం, అందుకు అనుగుణంగా తక్షణమే మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు.

జిల్లాలో 1080 పడకల సామర్థ్యంతో నాలుగు కోవిడ్ ఆసుపత్రులు, కడప నగరంలోని ఫిమ్స్ కోవిడ్ ఆసుపత్రి, రిమ్స్ పరిధిలోని జిజిహెచ్, ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి, పులివెందులలోని ఏరియా ఆసుపత్రిలో పడకలను అందుబాటులో ఉన్నాయన్నారు. 

క్రిటికల్ పొజిషన్ లో ఉన్న పాజిటీవ్ కేసులకు అత్యవసర సేవలు, మెరుగైన వైద్యం అందుతోందన్నారు. వీటితో పాటు 200 పడకల సామర్థ్యంతో.. తిరుపతిలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో జిల్లా ప్రజలకు కోవిడ్ వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. వీటిలో 500 లకు పైగా ఆక్సీజెన్ లైన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

ఆక్సిజన్ లైన్ బెడ్లను మరిన్ని పెంచుతున్నాం

త్వరలో ఆక్సీజెన్ లైన్ బెడ్లను కూడా అధిక సంఖ్యలో పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. కడప నగర పరిసరాల్లోని గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల, హజ్ భవన్ లో, శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో, పులివెందులలోని జేఎన్టీయూ కళాశాలలో ప్రస్తుతం కోవిడ్ కేర్ సెంటర్లు నిర్వహణలో ఉన్నాయన్నారు.

అలాగే కెఎల్ఎం, కెఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో, వైవీయూ హాస్టల్ భవనాల్లో, ప్రొద్దుటూరు సమీపంలోని సీబీఐటి కాలేజీలో, అనంతరాజుపేట హార్టికల్చర్ యూనివర్సిటిలో కూడా ఈ కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

వైద్య ఆరోగ్యశాఖ అమలు చేస్తున్న మెడికల్ ప్రోటోకాల్ ప్రకారం జిల్లా ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో పాజిటీవ్ కేసులకు వైద్యం, వసతి, భోజన సదుపాయం కల్పిస్తోందన్నారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం బలవర్ధకమయిన, వ్యాధి నిరోధకతను పెంచే పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు.

కడప జిల్లాలో నాలుగు నుంచి నాలుగున్నర వేల టెస్టులు

కడప జిల్లాలో కోవిడ్ పరీక్షల విషయానికి వస్తే.. పీహెచ్ సీలలో, సిహెచ్ సీలతో పాటు, 6 సంజీవని బస్సుల ద్వారా అత్యధిక సంఖ్యలో. రాపిడ్, ట్రూ నాట్ టెస్టింగ్ శాంపిల్స్, విఆర్డీఎల్ ల్యాబులు ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలో కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రోజుకు దాదాపు 4 వేల నుంచి 4,500 వరకు టెస్టులు చేస్తున్నారు.

ఇందులో పాజిటివ్ రేటు 17 శాతం నమోదు అవుతోంది. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా కరోనా నివారణ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, దేశంలో ఏ రాష్ట్రం చేయన్నని పరీక్షలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

సమావేశంలో అంతకు ముందుగా.. స్పందన హాల్ నుండి ఫాతిమా, జిజిహెచ్, ప్రొద్దుటూరు, పులివెందుల కోవిడ్ ఆసుపత్రులలో ఉన్న పాజిటివ్ పేషెంట్లతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా మాట్లాడారు.

ఆసుపత్రుల్లో ఉన్న పేషంట్లకు అందుతున్న వైద్య సేవలు, వసతుల కల్పన, భోజన సౌకర్యం, ఆసుపత్రిలో ఎన్ని రోజుల నుండి వుంటున్నారు ? ఆసుపత్రికి వచ్చినప్పటికీ, ఇప్పటికి మీ ఆరోగ్య పరిస్థితి  మెరుగు పడిందా? లేదా? ఆసుపత్రిలో పారిశుధ్యం మెరుగ్గా ఉందా? లేదా?  వైద్యులు బాగా చూసుకుంటున్నారా ? సమయానికి మందులు, భోజనం అందిస్తున్నారా ? అనే విషయాలను పాజిటివ్ పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు.

Related posts

నెల్లూరు ఘటనపై దిశ చట్టం ప్రయోగించండి

Satyam NEWS

ఘనంగా యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడు రవి రాఘవేంద్ర జన్మదినం

Satyam NEWS

సింగమనేని నారాయణ స్మారక రాయలసీమ కథల పోటీలు

Satyam NEWS

Leave a Comment