28.2 C
Hyderabad
January 21, 2022 17: 16 PM
Slider ముఖ్యంశాలు

నిజాయితీ చాటుకున్న కండక్టర్

#tsrtc

బస్సులో వృద్ధుడు మర్చిపోయిన  నగదు,పింఛన్ బుక్కు తిరిగి వృద్ధునికి అప్పగించి కండక్టర్ సుభాష్ నిజాయితీ చాటుకున్నారు. ఆర్టీసీ సూపర్ వైజర్ గోవర్ధన్ రెడ్డి చెప్పిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. లింగాల కు చెందిన రాత్లావత్ రాజు ఈనెల 12న  లింగాల గ్రామంలో వృధ్యాప పింఛన్ తీసుకుని పట్టణ సమీపంలో ని జయప్రకాష్ నగర్ వద్ద దిగి తాను పనిచేసే ఇటుక బట్టి వద్దకు వెళ్లారు. బస్సు దిగే సమయంలో బుక్కు,2260 నగదును బస్సులో మర్చిపోయారు. గురువారం కండక్టర్ సుభాష్, వృద్ధుడిని కల్వకుర్తి బస్టాండ్ కు పిలిచి నగదు,పింఛన్ బుక్కు అందజేశారు. ఈకార్యక్రమంలో నందయ్య తదితరులు పాల్గొన్నారు. కండక్టర్ ను డిఎం వసూరామ్ నాయక్ తదితరులు అభినందించారు.

Related posts

మోగిన దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల నగారా

Satyam NEWS

పేదలకు సేవ చేసిన నేతలు పరిటాల, ధూళిపాళ్ల

Satyam NEWS

దక్షిణ తెలంగాణ ను ఎడారి చేస్తారా?

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!