39.2 C
Hyderabad
March 29, 2024 15: 51 PM
Slider కడప

గుడ్ వర్క్:కరోనా కట్టడికి ఆర్టీసీ కాండక్టర్ల సేవలు

Rajampet RTC

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సేవలను వాలంటీర్లు గా ఉపయోగించుకునేందుకు ఆదేశాలు జారిచేయగా వారు రాజంపేట నియోజకవర్గ పరిధిలో ఆయా మండలాల్లో బాధ్యతలు స్వీకరించారు.

కడప జిల్లా నందలూరు మండలంలో ని పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాజంపేట ఆర్టీసీ కండక్టర్లకు కరోనా విధి నిర్వహణ బాధ్యతలను యస్.ఐ. ప్రసాద్ రెడ్డి అప్పగించారు. కరోనా మహమ్మారి ప్రజలను గడగలాడిస్తున్న నేపధ్యంలో దాని కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

సోషల్ డిస్టెన్సింగ్ పాటించేందుకు వీలుగా పలు చోట్ల జనాలు గుమి కూడకుండా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాజంపేట డిపొలో ని 13 మంది కండక్టర్ లకు కరోనా పై దిశానిర్దేశం చేసి వారి సేవలను నందలూరు మండలం లో ఉపయోగించుకోనున్నట్టు యస్.ఐ. ప్రసాద్ రెడ్డి తెలిపారు.

Related posts

పార్కింగ్ తో కూడిన సోలార్ షెడ్ ను ప్రారంభo

Bhavani

R V టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ప్రత్యేక ప్యాకేజీలు

Satyam NEWS

టెట్ విషాదం: పరీక్ష హాల్ లో గర్భవతి మృతి

Satyam NEWS

Leave a Comment