ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయంతో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికీ చెందిన శ్రీనివాసరెడ్డి ఖమ్మం డిపోలో డ్రైవర్ గా పని చేస్తూ ఖమ్మం నగరంలో సెటిలైనాడు. ఆర్టీసి సమ్మె పై సియం కేసీఆర్ ప్రకటనతో మనోవేదన చెంది అకస్మాత్తుగా ఆత్మహత్యయత్నం చేశాడు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నం తో ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు, కార్మిక సంఘాల నేతలు శ్రీనివాస్ రెడ్డి చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో చేరుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో కార్మికులు చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీ కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై గత కొద్ది రోజులుగా శ్రీనివాసరెడ్డి మధనపడుతున్నాడు. ప్రభుత్వ వైఖరితో మనస్థాపానికి గురి అయి ఆత్మహత్యాయత్నం చేశాడు. శ్రీనివాస రెడ్డి ని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. శ్రీనివాసరెడ్డి కి ఈ నెల జీతం రాలేదు. ఇది కూడా ఒక కారణం అయింది. శ్రీనివాసరెడ్డి శరీరం 90 శాతం కాలిపోయింది.
previous post