28.2 C
Hyderabad
April 30, 2025 06: 06 AM
Slider నిజామాబాద్

పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లు

#Petrol Bunk

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్ బంకులో ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు పనిచేస్తున్న దృశ్యం సోమవారం ఆవిష్కృతమైంది. ఈ విషయంపై డ్రైవర్ కండక్టర్లకు మాట్లాడగా వచ్చే నెల నుండి పూర్తిస్థాయిలో పెట్రోల్ బంకులో విధులు నిర్వర్తించాలంటూ ఆదేశాలు జారీ కావడంతో ముందస్తుగా శిక్షణ పొందుతున్నామన్నారు.

వచ్చే నెల నుండి పూర్తిస్థాయిలో పెట్రోలు  బంకులోనే విధులు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఉన్నతాధికారులు ఏది చెప్తే అది చేయాల్సిందేనని వారు తమ దీనావస్థను సత్యం న్యూస్ తో  పంచుకున్నారు. కానీ వీరు ఇక్కడ పనిచేయడం పట్ల మండల ప్రజలు ఆశ్చర్యానికి  లోనయ్యారు.

డ్రైవర్లు బస్సులు నడపాలి కండక్టర్లు టిక్కెట్ చి౦ప్పాలి కానీ పెట్రోలు బంకులు పని చేస్తున్నారేంటి అని మండలంలోని పలువురు తమ అభిప్రాయాలను ప౦చుకున్నారు.

Related posts

అడిటర్ బుచ్చిబాబుపై ఈడీ ప్రశ్నల వర్షం

mamatha

ఒమిక్రాన్‌‌‌ ఇన్ఫెక్షన్‌లతో డెల్టాకు చెక్

Sub Editor

మట్టపల్లి మహా క్షేత్రంలో నూతన ఆంగ్ల క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!