35.2 C
Hyderabad
April 24, 2024 11: 25 AM
Slider తెలంగాణ

కేసీఆర్ పుణ్యమా అని రోజుకూలిగా మారిన ఆర్టీసీ కార్మికుడు

rtc emp

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసి కార్మికుల విషయంలో వ్యవహరిస్తున్న  మొండి వైఖరి వల్ల అటు కార్మికులు, ఇటు సాధారణ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. తమ డిమాండ్లను సాధించుకునేందుకు గత నెలరోజులకు పైగా పలు విధాలుగా ధర్నాలు, రాస్తారోకోలు, మిలియన్ మార్చ్ లు సైతం నిర్వహించినా, హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ వైఖరి మాత్రం మారడంలేదు. సర్కార్ ఆర్టీసీ కార్మికుల పట్ల అనుసరిస్తున్న విధానాల వల్ల ఇప్పటికే కొందరు కార్మికులు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. మరికొందరు మానసికంగా కృంగిపోతున్నారు. తాజాగా ఓ కార్మికుడు కర్షకుడిగా మారారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని డాఖ్య గిరిజన తాండాకు చెందిన గుగులోత్ నారాయణ్ సింగ్ ఐడి నంబర్ 216902 (2009) సంవత్సరంలో భాగ్యనగరం లోని కూకట్ పల్లి బస్సు డిపోలో కండక్టర్ గా విధుల్లోకి చేరాడు. 2011 సంవత్సరంలో ఇతనికి రెగ్యులర్ అయ్యింది. అప్పటినుండి కూకట్ పల్లి డిపోలో విధులు నిర్వహిస్తున్న నారాయణ్ సింగ్ ఆర్టీసీ కార్మికుల జాక్ పిలుపు మేరకు సమ్మెలో భాగంగా విధులకు హాజరు కాకుండా ఆర్టీసీ కార్మికుల సమ్మెలో పాల్గొంటున్నాడు. కాగా ఇతనికి భార్య , ముగ్గురు సంతానం. అందులో ఇద్దరు కూతుళ్ళు, ఒక బాబు ఉన్నారు. అందులో పెద్ద కూతురు మెదక్ లోని ఓ కళశాలలో మొదటి సంవత్సరం, రెండవ కూతురు 9వ తరగతి, కొడుకు 6వ తరగతి చదువుతున్నారు. చాలిచాలని జీతంతో విధులు నిర్వహిస్తున్న నారాయణ్ సింగ్ భాగ్యనగరంలో ఇంటి కిరాయిలు ఎక్కువగా ఉండడంతో అప్పటి నుండి  పిల్లల చదువుల కోసం మెదక్ లో ఉంటూ.. తనే డ్యూటీ దూరమైన భారాన్ని బరిస్తూ విధులు నిర్వహిస్తూ మెదక్ వచ్చి వెళ్ళేవాడు. అయితే గత రెండు నెలలుగా జీతం లేక కుటుంబ భారాన్ని మోయలేక సతమతమవుతున్నారు. రోజురోజుకు ఆర్థిక కష్టాలు అధికమవడంతో చేసేది లేక స్వగ్రామమైన డాఖ్య తండాకు వెళ్ళి రోజు కూలీగా మారాడు. గ్రామంలో ఎవరు కూలికి పిలిస్తే వాళ్ల వద్దకు పనికి వెళుతూ కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించి అందరిని విధుల్లోకి తీసుకోవాలని నారాయణ సింగ్ కోరుతున్నారు. ఆర్టీసీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందని అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

Related posts

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు

Satyam NEWS

తిరుపతి లోక్ సభ నుంచి బిజెపి అభ్యర్ధి కే అవకాశం

Satyam NEWS

సింహాచలం భూములపై కన్నేసి కుట్ర చేస్తున్నారు

Satyam NEWS

Leave a Comment