33.2 C
Hyderabad
June 17, 2024 16: 03 PM
Slider తెలంగాణ

హుజూర్ నగర్ ఉప ఎన్నికపై ఆర్టీసీ సమ్మె ప్రభావం?

rtc emp

హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో అధికార పార్టీ కష్టాలనే చవిచూస్తున్నది. మండలానికో నాయకుడు ఇన్ చార్జిగా ఉండి ప్రచారం చేస్తున్నా అనుకూల ఫలితం ఎంత మేరకు వస్తుందనేది ప్రశ్నార్ధకంగా ఉంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రచారం చేయకపోయినా ఆ పార్టీ అభ్యర్ధి పద్మావతి పట్ల సానుభూతి పవనాలు వీస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. రాజకీయ అంశాల కన్నా కూడా ఆర్టీసీ సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంటుందనే అంచనా కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణితో ఆర్టీసీ కార్మికుల హక్కులను కాలరాస్తున్నదనే అభిప్రాయం నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది. నియోజకవర్గానికి సంబంధించిన అంశాల కన్నా కూడా ఆర్టీసీ సమ్మె ప్రభావం ఓటింగ్ పై ఎక్కువగా ఉండబోతున్నట్లు అంచనా ఉంది. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. సమైక్య ఆంధ్రలో ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి కేసీఆర్ అన్న మాటల వీడియో ఇక్కడ విస్త్రతంగా ప్రచారం లో ఉంది. హుజూర్ నగర్ లో నేడు ఆర్టీసీ కార్మకులు నిర్వహించిన బిక్షాటన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. అదే కాకుండా రెవెన్యూ శాఖ కు చెందిన సిబ్బంది అంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఇది హుజూర్ నగర్ నియోజకవర్గంలో చాపకింద నీరులాగా పని చేస్తున్నది. గ్రామాలలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న టిఆర్ఎస్ నాయకులకు ఎక్కడా వ్యతిరేకత ఎదురు కావడం లేదు కానీ లోలోపల వ్యతిరేకత గూడుకట్టుకుని ఉన్నట్లు చెబుతున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సెటిలర్లు కూడా ఓట్లు చీలకుండా ఉండేదుకు ప్రయత్నిస్తున్నారు. సెటిలర్లు బలిమికి ఎక్కడైనా టిఆర్ఎస్ వైపు మొగ్గు చూపాల్సిందే కానీ ఎక్కువ శాతం ఓట్లు తమకే వస్తాయని కాంగ్రెస్ పార్టీ లెక్క వేసుకుంటున్నది. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి రంగంలో ఉన్నా ఆమెకు సెటిలర్ల ఓట్లు ఎక్కువగా వచ్చే అవకాశం లేదని అంటున్నారు. టిఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి సెటిలర్ అనే ముద్ర ఉన్నందున సెటిలర్ల ఓట్లు ఆయనకు ఎక్కువగా వెళతాయని ఆలోచించి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిని దించింది కానీ సెటిలర్లు మొత్తం కాంగ్రెస్ వైపు నకే మొగ్గు చూపుతున్నారని తాజాగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో వెల్లడి అయింది. టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరింత ఎక్కువగా శ్రమ పడితే తప్ప హుజూర్ నగర్ లో ఉత్తమ ఫలితాన్ని రాబట్టే అవకాశం ఉండదు.

Related posts

నేవీలో సబ్-మెరైన్ డేటా లీక్ కలకలం.. సీబీఐ ఛార్జిషీట్

Sub Editor

డీప్ ట్రబుల్: పెరుగుతున్నఅమెరికా ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు

Satyam NEWS

పోస్ట్ ప్రొడక్షన్ లో అడుగు పెట్టిన ‘ఎక్కడికో ఈ అడుగు’

Sub Editor

Leave a Comment