32.2 C
Hyderabad
April 20, 2024 19: 06 PM
Slider తెలంగాణ ప్రత్యేకం

తాత్కాలిక ఉద్యోగులకు ఆర్టీసీ రివర్స్ గేర్

TSRTC

ఆరు రోజులుగా ఆర్టీసీ సమ్మె ఉధృతంగా జరుగుతున్నది కదా ప్రభుత్వానికి సాయం చేద్దామని వెళ్లిన తాత్కాలిక ఉద్యోగుల్ని కట్టు బానిసల్లా చూస్తున్నారు. బాహుబలి సినిమాలో కట్టప్ప లాగా తమకు ఎదురు చెప్పకుండా ఇచ్చినంత తీసుకుని నోరు మూసుకుని వెళ్లిపోవాలని చెబుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక డ్రైవర్లను కండక్టర్లను నియమించేందుకు ఆదేశాలిచ్చిన ప్రభుత్వం వారికి దినసరి వేతనం ఎంత ఇవ్వాలో కూడా నిర్ణయించింది.

అయితే అదేమిటో గానీ ఆర్టీసీ అధికారులు మాత్రం తాత్కాలిక డైవర్లకు ప్రభుత్వం నిర్దేశించిన దినసరి జీతం ఇవ్వకుండా చీదరించుకుంటున్నారు. ఒక చోట కాదు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అన్ని డిపోలలో ఇదే పరిస్థితి ఉంది. ఆర్టీసీ సిబ్బంది స్థానంలో పనికి కుదిరిన వారు ఎందుకు వచ్చాంరా దేవుడా అని మొత్తుకుంటున్నారు. మొదటి రెండు రోజులు మర్యాదగా చూసిన ఆర్టీసీ అధికారులు ఆ తర్వాత నుంచి తమను వేధిస్తున్నారని తాత్కాలిక సిబ్బంది వాపోతున్నారు.

ప్రభుత్వానికి సాయం చేయడంతో బాటు ఉపాధి కూడా దొరుకుతుందని ఎంతో ఆశగా వచ్చిన తమకు రెగ్యులర్ ఎంప్లాయిస్ మాదిరిగా టార్గెట్లు పెడుతున్నారని తాత్కాలిక ఉద్యోగులు అంటున్నారు. ప్రయివేటుగా తాము డ్రైవర్ పని చేస్తే రోజుకు కనీసం వెయ్యి రూపాయల నుంచి 1200 వరకూ వస్తుందని అయితే ప్రభుత్వం తమ చేతిలో రోజుకు 500 రూపాయలు పెడుతున్నదన్నది వారు అంటున్నారు.

ఆర్టీసీ కనీసం 1500 ఇస్తుందని తమకు చెప్పారని అందువల్లే వచ్చామని అయితే కలెక్షన్ టార్గెట్ లు పెట్టి రోజుకు 500 మాత్రమే ఇస్తున్నారని వారు అంటున్నారు. మొదటి రెండు రోజులూ పండుగ కాబట్టి తాము టార్గెట్లు పూర్తి చేశామని ఆ తర్వాత నుంచి తమకు కలెక్షన్ పడిపోయిందని అంటున్నారు. కలెక్షన్ పడిపోతే తమ తప్పెలా అవుతుందని వారు అంటున్నారు. ట్రిప్పుల లెక్క పెట్టి మా జీతం మాకు ఇవ్వాలి కానీ కలెక్షన్ తో మాకు ముడిపెడితే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు మెదక్ డిపోలో తాత్కాలిక ఉద్యోగులకు టార్గెట్ పెట్టారు.

మెదక్ టూ హైదరాబాద్ వయా తూప్రాన్ రూట్లో రెండు ట్రిప్పులు బస్సు నడిపితే రూ.16వేల కలెక్షన్ ఇవ్వాలని టార్గెట్ పెట్టారని తాత్కాలిక డ్రైవర్, కండక్టర్  చెప్తున్నారు. అయితే పండగ తెల్లవారు, తర్వాత రోజు బానే కలెక్షన్స్ వచ్చాయట, ఇవాళ కలెక్షన్స్ తగ్గడంతో మా చేతినుంచి డబ్బులు కట్టాల్సి వచ్చిందని, రేపటి నుంచి వెళ్ళమని చెప్తున్నారు. అదేవిధంగా నర్సాపూర్, బాలానగర్ రూట్లో కూడా సేమ్ ప్రాబ్లం అవుతుంది.

ప్రొద్దస్తమానం పనిచేస్తే డ్రైవర్ కు రూ.800, కండక్టర్ కు రూ 500 ఇస్తున్నారట, అదీగాక ఎన్ని డబ్బులు నొక్కేశారు అని కూడా అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరికొందరు తాత్కాలిక ఉద్యోగులు. దుబ్బాక లో కూడా ఒక్కొక్కరికి టార్గెట్ ఇచ్చుకుంటూ టార్గెట్ పూర్తి చేసిన వారికే జీతం  ఇస్తున్నారు లేదంటే కోత విధిస్తున్నారు. నాగర్ కర్నూల్ డిపో లో కూడా మూడు వందల నుండి 500 కు మధ్య చెల్లిస్తున్నారు.

అదేమని  ప్రశ్నిస్తే మీరు ఎన్ని ట్రిప్పులు డ్యూటీ చేశారు అని అధికారులు ఎదురు ప్రశ్నిస్తున్న ట్లు సమాచారం. కరీంనగర్ జిల్లాలో అయితే ట్రిప్పుల లెక్కన రూజువారి జీతం ఇస్తున్నారు. అయితే ఆర్టీసీ అధికారులు ఇచ్చే సమయం లోపు ట్రిప్పులు పూర్తి కావడం లేదు. దాంతో వారికి కేవలం రోజుకు 500 మాత్రమే ఇస్తున్నారు. తాత్కాలిక ఉద్యోగుల నుంచి ఆర్టీసీ రివర్స్ దోపిడి చేయడం కొత్తగా ఉంది.

సత్యం న్యూస్ ఫీడర్స్ గ్రూప్ మెదక్, దుబ్బాక, నాగర్ కర్నూల్, హుజూరాబాద్

Related posts

సమానత్వం కుటుంబం నుంచే ప్రారంభం

Murali Krishna

కొత్త రెవెన్యూ చట్టాన్ని, ఎల్ఆర్ఎస్ ను వ్యతిరేకించండి

Satyam NEWS

మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ కు 50 కోట్లు విడుదల

Satyam NEWS

Leave a Comment