38.2 C
Hyderabad
April 25, 2024 13: 53 PM
Slider తెలంగాణ

విలీనం అవసరం లేదు చర్చలకు పిలవండి

Ashwathama-Reddy1570460528

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే అంశాన్ని తాత్కాలికంగా పక్కన బెట్టామని ఆర్టీసీ జెఎసి కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. అందుకోసం తక్షణమే ప్రభుత్వం ​చర్చలు జరపాలని కోరుతున్నాం అని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీని రక్షించాలంటూ రేపు బైక్ ర్యాలీ  నిర్వహిస్తామని, హైదరాబాద్ లో 16న నిరాహార దీక్ష తాను తనతో బాటు మరో నలుగురు నిరాహార దీక్ష ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అదే విధంగా ​17,18 తేదీలలో డిపోల దగ్గర కార్మికుల సామూహిక దీక్ష చేస్తారని ఆయన అన్నారు. ​19 న హైదరాబాద్ నుండి కోదాడ వరకు సడక్ బంద్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కనీసం పరామర్శించిన దాఖలాలు లేవని ఇంత దుర్మార్గపు ప్రభుత్వాన్ని తాము ఇంత వరకూ చూడలేదని అశ్వద్ధామ రెడ్డి తెలిపారు. ​ఆర్టీసీ ప్రైవేటు పరం చేస్తే బడుగు బలహీన వర్గాలు ఉపాధి అవకా శాన్ని కోల్పోవలసి వస్తుందని, ​ఇప్పటికే పలు కార్పొరేట్ కంపెనీల్లో అది రుజువవుతోందని ఆయన అన్నారు. చనిపోయిన 23 కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. ​

Related posts

తిరుమ‌ల‌లో తరిగొండ వెంగమాంబ ఆరాధన కేంద్రం ఏర్పాటు

Satyam NEWS

వచ్చే ఎన్నికల్లో పర్చూరు నుంచి నవతరం పార్టీ పోటీ

Satyam NEWS

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి

Satyam NEWS

Leave a Comment