ఆర్టిసి కార్మికుల ఆత్మహత్యలతో సమ్మె ఉగ్రరూపం దాలుస్తోంది. వరుస పరిణామాలు కార్మికుల్లో ఆందోళనను కలగజేస్తున్నాయి. ఫలితంగా కార్మికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనను తీవ్రతరం చేసారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి, కండక్టర్ సురేందర్ రెడ్డి మృతి చెందడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్ శవయాత్ర చేపట్టారు. ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ శవయాత్ర కొనసాగించారు. శవయత్రతో బసు డిపో వద్ద ఆందోళన చేపట్టడానికి కార్మికులు డిపో లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు బారికేడ్లను పెట్టి కార్మికులను అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, కార్మికులకు మధ్య కాసేపు తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో సమ్మెలో పాల్గొన్న రాజేష్ అనే కండక్టర్ చేయి విరిగింది. అతన్ని వెంటనే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్సలు చేయించారు. ఈ తోపులాటల మధ్యనే కేసీఆర్ శవయాత్ర చేపట్టి దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఈ సందర్బంగా మహిళా కార్మికులు మాట్లాడుతూ.. ఇంకా ఎంతమంది చనిపోతే కేసీఆర్ స్పందిస్తారని ప్రశ్నించారు. పక్క రాష్ట్ర సీఎం జగన్ ఆర్టిసిని ప్రభుత్వం విలీనం చేసారని గుర్తు చేశారు. చిన్నవాడు సీఎం అయ్యాడని జగన్ సీఎం అయినప్పుడు చెప్పిన కేసీఆర్.. చిన్నోనికి ఉన్న జ్ఞానం నీకు లేదాయే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సకల జనుల సమ్మెలో తాము పాల్గొంటేనే స్వరాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు సకల జనుల సమ్మె లాంటి మా పోరుతో నిన్ను గద్దె దింపడం ఖాయమని, ఖబడ్దార్ కేసీఆర్ అంటూ హెచ్చరించారు
previous post