తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల మొండి గా వ్యవహరిస్తుందని టీపీసీసీ కార్యనిర్వహణ కార్యదర్శి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆర్టీసీ సమ్మెలో భాగంగా కొల్లాపూర్ పట్టణం కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆర్టీసీ కార్మికులు పదవ రోజు వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెసు, బిజెపి, టిడిపి, వామపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. రాష్ట్ర పిఆర్ టి యు ఉపాధ్యక్షుడు ఆల్వాల అర్జున్ గౌడ్ సమ్మెకు మద్దతు తెలిపారు. ఆత్మ బలిదానాలు చేసుకున్న శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ ల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయాలన్నారు. కేసీఆర్ మొండి వైఖరి సరికాదన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే కెసిఆర్ ప్రభుత్వానికి కనిపించడం లేదని టిపిసిసి కార్యనిర్వహణ కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి, ఓబీసీ జిల్లా నాయకులు గాలి యాదవ్, సీనియర్ నాయకులు రంగినేని జగదీశ్వర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్, టీడీపీ మండల అధ్యక్షుడు ఉడుత రామస్వామి, బీజేపీ మండల అధ్యక్షుడు సాయి కృష్ణ గౌడ్ ఆరోపించారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు పార్టీలకు అతీతంగా ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండి పోరాడతామన్నారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పోరాటం చేస్తాయని పిఆర్ టి యు ఉపాధ్యక్షులు అర్జున్ గౌడ్ అన్నారు. ఆర్టిసి సమ్మెకు మద్దతు పలుకుతున్న వివిధ పార్టీలు ఉద్యోగ, ప్రజా సంఘాలకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి రామయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ఏఆర్ ఏఎస్పీ అజయ్ కుమార్,ఎస్ఐ కొంపల్లి.మురళి గౌడ్,భద్రత చర్యలు తీసుకున్నారు.
previous post
next post