34.2 C
Hyderabad
April 19, 2024 21: 58 PM
Slider విజయనగరం

ధర్డ్ వేవ్ లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

#vijayanagaram

థ‌ర్డ్ వేవ్ రాబోతోందా…? అదీ మ‌రో రెండు నెలల్లోనా..?  ఈ ఆలోచన‌లు  జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో రావ‌డం త‌ద‌నుగుణంగా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగిపోతున్నాయి. ఈ క్ర‌మంలోనే  ఈనెల 15 నుంచీ రాత్రిపూట అంటే 9 నుంచీ మ‌ర్నాడు ఉద‌యం 6 గంట‌ల‌కు పూర్తి స్తాయిలో క‌ర్ఫ్యూ అమ‌లు చేయ‌నుంది.

ఇప్ప‌టికే అన్ని జిల్లాల క‌లెక్టర్లు,ఎస్పీల‌కు ఆదేశాలు వెళ్లిపోయాయి. అందులో భాగంగానే విజ‌య‌న‌గరం జిల్లాలో క‌లెక్ట‌ర్,ఎస్పీ సంయుక్తంగా మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ రాబోతున్న థ‌ర్డ్ వేవ్ గురించి తీసుకోబోతున్న చ‌ర్య‌ల‌పై వివరంచారు.

ముందుగా జిల్లా క‌లెక్ట‌ర్ డా.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడారు. ఫ‌స్ట్,సెకండ్ వేవ్ క‌రోనా వైర‌స్ విస్త్ర‌తి,వ్యాప్తి త‌ద‌నంత‌ర  ప‌రిణామాల గురించి పాఠాలు నేర్చుకున్నామ‌ని రాబోవు థ‌ర్డ్ వేవ్ లో రూల్స్ అత‌క్ర‌మిస్తే  క‌ఠినా శిక్ష‌లు త‌ప్ప‌వ‌ని  జిల్లా క‌లెక్ట‌ర్ డా.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ హెచ్చరించారు.

ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఫ‌స్ట్ వేవ్ వ‌చ్చింద‌ని చాలా మంది ప్రాణాలు కూడా పోయాయ‌న్నారు.అనంత‌రం వ‌చ్చిన సెకండ్ వేవ్ లో అప్ప‌టిక‌ప్పుడు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోక‌పోయినా ఫ‌స్ట్ వేవ్  అనుభ‌వంతో సెకండ్ వేవ్ క‌రోనా వైర‌స్ ఎఫెక్ట్ ను కాస్త త‌ట్టుకుని…వ్యాక్సినేష‌న్ కు సిద్ద‌ప‌డ్డామ‌న్నారు.

కాని మ‌రో మూడు నెల‌లో కరోనా  థ‌ర్డ్ వేవ్ రాబోతుంద‌న్న హెచ్చ‌రిక‌ల నేప‌ధ్యంలో  ఇప్ప‌టి నుంచీ ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు…ఇందు కోసం జిల్లా యంత్రాంగం క‌రోనా రాపిడ్ ఫోర్స్ తో  వైర‌స్ కు అడ్డుక‌ట్ట వేస్తున్న‌ట్టు కలెక్ట‌ర్ తెలిపారు.

శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో క‌రోనా థ‌ర్డ్ వేవ్ అటాక్ అవ్వ‌కుండా వ్యాక్సినేష‌న్ ప్ర‌కృయ‌తో ముందుకు వెళుతున్న‌ట్టు జిల్లా క‌లెక్ట‌ర్ తెలిపారు.అనంత‌రం జిల్లాకు కొత్త‌గా వ‌చ్చిన ఎస్పీ దీపికా పాఠిల్ మాట్లాడారు.

థ‌ర్డ్ వేవ్ నిబంధ‌న‌లు…అతిక్ర‌మిస్తే కేసులు త‌ప్ప‌వు-కొత్త ఎస్పీ వార్నింగ్!

థర్డ్ వేవ్ రాకుండా ఉండేందుకు నిబంధ‌న‌ల‌ను  క‌చ్చితంగా పాఠించాల్సిందేన‌ని ఎవ్వ‌రైనా వాటిని అత‌క్రిమిస్తే.. త‌ప్ప‌ని స‌రిగా కేస‌లు పెడ‌తామ‌ని కొత్త‌గా ఎస్పీగా బాధ్య‌త‌లు తీసుకున్న దీపికా పాఠిల్ హెచ్చ‌రించారు. థ‌ర్డ్ వేవ్ ప‌ట్ల పోలీస్ శాఖ మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉంటుంద‌న్నారు.

ఫస్ట్,సెకండ్ వేవ్ ల పట్ల శాఖ ప‌రంగా చేప‌ట్టిన చ‌ర్య‌లు క‌న్నా మ‌రింంత క‌ఠినంగా నిర్వహిస్తామ‌న్నారు. నిబంద‌న‌లు అతిక్ర‌మిస్తే కేసుల‌తో  పాటు జ‌రీమానాలు త‌ప్ప‌వ‌ని  మీడియా ముఖంగా ఎస్పీ స్పస్టం చేసారు. అంత‌కుముందు కొత్త ఎస్పీ దీపికా పాఠిల్ కు స‌మాచార శాఖ ఏడీ ర‌మేష్ త‌న స‌హ‌చ‌ర జ‌ర్న‌లిస్టుల‌ను ప‌రిచ‌యం చేసారు.

Related posts

కర్ణాటకలో బిజెపి ఓటమి దక్షిణ భారత ప్రజల విజయం

Bhavani

బిఆర్ఎస్ పార్టీలోకి బిల్డర్ అమీర్

Satyam NEWS

ఒకవైపు కర్తవ్యం.. మరోవైపు మానవత్వం చాటుకున్న ములుగు ఎస్సై హరికృష్ణ

Satyam NEWS

Leave a Comment