37.2 C
Hyderabad
March 29, 2024 20: 27 PM
Slider నిజామాబాద్

టికెట్ కేటాయింపులో షబ్బీర్ అలీ హోదా ఏంటి..?

#madanmohanrao

కామారెడ్డి కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. నిన్నమొన్నటి వరకు ఉప్పునిప్పులా ఉన్న నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటనతో అయినా ఏకతాటిపైకి వస్తారేమోనని కిందిస్థాయి కార్యకర్తల ఆశలు ఆడియాశాలవడంతో పాటు రేవంత్ రెడ్డి క్యాంప్ వద్ద కొట్టుకునే స్థాయికి చేరాయి.

గాంధారి మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి చేపట్టిన నిరుద్యోగ నిరసన దీక్ష కార్యక్రమంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల బాధ్యత తాను చూస్తానని షబ్బీర్ అలీ చెప్పడంపై ఆ పార్టీ ఐటి సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు మండిపడ్డారు. నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి షబ్బీర్ ఆలీపై నిప్పులు చెరిగారు. నిన్న గాంధారిలో ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలను మాజీ మంత్రి షబ్బీర్ అలీ చూస్తానని చెప్పడాన్ని తప్పుబట్టారు. వరంగల్ డిక్లరేషన్ సభలో కష్టపడ్డ వాళ్ళకే టిక్కెట్ ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. టికెట్ విషయంలో ఇలాంటివి మాట్లాడి కార్యకర్తల్ని అయోమయానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మేల్యే టిక్కెట్ లు ఎంపిక చేసే అధికారం ఏఐసీసీకి మాత్రమే ఉందని, షబ్జిర్ అలీకి లేదన్నారు.

షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి కామారెడ్డి, ఎల్లారెడ్డిల్లో ఏడు సార్లు ఓడిపోయారని గుర్తుచేశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉందని పదేపదే చెప్పుకునే షబ్బీర్ అలీ పార్టీ ఎన్నికల్లో అతని కొడుకునే గెలిపించుకోకపోయాడని విమర్శించారు. షబ్బీర్ అలీ కామారెడ్డిలో గెలిచి ఎల్లారెడ్డిలో మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎవడి సొత్తు కాదని, కష్టపడే వారికి టిక్కెట్ వస్తదన్నారు. నిన్నటి వ్యాఖ్యలకు కార్యకర్తలు అధైర్య పడవద్దని కోరారు. ప్రజలు మదన్ మోహన్ ను నాయకునిగా వద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉంటాడన్నారు.

షబ్బీర్ అలీ మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడవద్దని మండిపడ్డారు. షబ్బీర్ అలీ సిడబ్ల్యుసి కాదు.. టిపిసిసి అధ్యక్షులు కాదని, టిక్కెట్ గురించి మాట్లాడే హక్కు షబ్బీర్ అలీకి లేదన్నారు. ఎఐసిసి ఆదేశాల మేరకు తాను ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎల్లారెడ్డి నుండి పోటీ చేస్తానన్నారు. అయోమయానికి గురవుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే తాను ఈ రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

మూడు సార్లు ఓడిపోయిన వారికి టిక్కెట్ ఇవ్వకూడదనే పాలసీ కాంగ్రెస్ పార్టీలో ఉందని, ఆ లెక్కన చూస్తే షబ్బీర్ ఆలీకి టికెట్ కూడా దక్కదన్నారు. తాను ఆస్తులన్ని అమ్ముకుని ప్రజల మధ్య ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నానని చెప్పారు. అధిష్టానం ఎంపీ టికెట్ ఇస్తుందేమోనన్న విలేకరుల ప్రశ్నకు సమాధానమిస్తూ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని, ఏ టికెట్ ఇచ్చినా శిరసా వహిస్తానన్నారు. టికెట్ తనకు ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చినా కార్యకర్తగా కాంగ్రెస్ లోనే కొనసాగుతాను తప్ప పార్టీ మారే ఆలోచన లేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. పారీ టికెట్ ఇవ్వకపోతే కామారెడ్డి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అనే ప్రశ్నకు అలాంటిదేమి లేదని సమాధానమిచ్చారు. కార్యకర్తలు ఆందోళన చెందవద్దని కోరారు.

Related posts

ప‌ర్యావ‌ర‌ణానికి ప్రాముఖ్య‌త‌నివ్వాలి ఐఎన్‌టీయూసీ

Sub Editor

ఘనంగా తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు పండుగ

Satyam NEWS

తిట్లతో మరింత బలం

Murali Krishna

Leave a Comment