35.2 C
Hyderabad
April 24, 2024 13: 03 PM
Slider పశ్చిమగోదావరి

చినుకు పడితే ఛిద్రం అవుతున్న రోడ్లు

ఏలూరు జిల్లా పెదవేగి మండలం కూచింపూడి గ్రామంలో ర్యాంప్ సెంటర్ నుండి శుద్ధరాళ్ల మెట్ట దగ్గర వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు ఆర్ అండ్ బి రహదారి అధ్వాన్నంగా ఉంది. కొద్దిపాటి వర్షానికి కూడా రహదారంతా మోకాలి లోతు నీళ్లు చేరి రోడ్డంతా బురద గా మారి వాహనాలు స్కిడ్ ఐపోతుంటాయి. ఈ రహదారి దుస్థితి ఏళ్లతరబడి గ్రామాన్ని వదలడం లేదు. సంబంధిత అధికారులు ఒకసారి ఈ రహదారి పై ఒక లుక్ వెయ్యండి బాబూ అంటున్నారు కూచింపూడి గ్రామస్తులు.

అదే విధంగా ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బాధరాల మెట్ట దగ్గర కూడా రోడ్డు అధ్వాన్నంగా ఉంది. ఇక్కడకూడా వర్షపు నీరు చేరి బురద బురద గా మారి ద్విచక్ర వాహన దారుల గుండెలను గుబేలు మనిపిస్తుంది. వాహనాన్ని ఇటువైపునుండి పోనిస్తే అటు వైపుకు స్కిడ్ అవుతుంది అని వాహన దారులు భయపడుతున్నారు. అధికారులు ఇటువైపు ఒకసారి వచ్చి చూసి ఈ రహదారి కి మోక్షం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Related posts

ట్రాజెడీ: సీనియర్ నటి వాణిశ్రీకి పుత్రశోకం

Satyam NEWS

నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్

Satyam NEWS

కల్వకుర్తి కి చేరిన నిరుద్యోగ భరోసా యాత్ర

Satyam NEWS

Leave a Comment