35.2 C
Hyderabad
April 20, 2024 17: 44 PM
Slider ప్రపంచం

భారత్ అమ్ములపొదిలో త్వరలో చేరనున్న ఎస్-400 మిస్సైల్

s-400 missile

అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఎస్​-400 ఉపరితలం నుంచి ప్రయోగించే (సర్ఫేస్ టు ఎయిర్) క్షిపణులను ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే భారత్​కు అందిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. 2015 నుంచి ఎస్-400 సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ ను తీసుకోవడానికి భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. ట్రిమ్ఫ్ పేరుతో ఉండే ఈ మిస్సైల్స్ భారత రక్షణకు ఎంతో అవసరమని రక్షణ శాఖ భావిస్తున్నది. గత ఏడాది ఈ సరఫరా కాంట్రాక్టుపై భారత్ రష్యాలు సంతకాలు చేశాయి. అయితే రష్యా నుంచి రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేయకూడదంటూ ఇంతకు ముందు భారత్​ను అమెరికా హెచ్చరించింది. అమెరికా చెప్పినా కూడా ఎస్​-400 కొనుగోలుకే నిర్ణయించుకున్నట్లు భారత్​ అమెరికాకు స్పష్టం చేసి రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.​ బ్రెజిల్ లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు అనంతరం పుతిన్ భారత్ కు ఎస్-400 సరఫరాపై విస్పష్ట ప్రకటన చేశారు. మరి కొంత కాలంలో భారత అమ్ముల పొదిలో ఈ అత్యాధునిక క్షిపణులు చేరనున్నాయి.

Related posts

ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు తాత్వికత బోధించాలి

Satyam NEWS

హుజుర్ నగర్ ఆటో వర్కర్స్ యూనియన్ ఎన్నిక

Satyam NEWS

టీబి ముక్తభారత్ లో పాల్గొన్న నెల్లూరు ఎంపీ ఆదాల

Satyam NEWS

Leave a Comment