32.7 C
Hyderabad
March 29, 2024 12: 23 PM
Slider ప్రత్యేకం

అమానుషం: శరణార్థులు ఉన్న స్కూలుపై రష్యా బాంబుల దాడి

#russiaattack

ఎన్ని రోజులు యుద్ధం చేసినా ఉక్రేయిన్ తమ వశం కాకపోవడం రష్యాకు మతి పోయేలా చేస్తున్నది. ఈ పరిస్థితుల్లోనే రష్యా సైనికులు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఉక్రెయిన్​ లో శరణార్థులు తలదాచుకున్న ఒక ఆర్ట్​ స్కూల్​పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. పోర్ట్ సిటీ మేరియపోల్​ ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా సేనలు గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ క్రమంలో మేరియపోల్​లోని ఒక ఆర్ట్ స్కూల్​పై బాంబు దాడులకు తెగబడింది. ఆ స్కూల్​లో సుమారు 400 మంది శరణార్థులు తలదాచుకున్నట్టు ఉక్రెయిన్​ అధికారులు చెప్పారు. బాంబు దాడుల్లో స్కూల్​ భవనం నేలమట్టమయ్యిందని, చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారని తెలిపారు. అయితే ఈ దాడుల్లో ఎంత మంది మరణించారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

రష్యా మూకలు ఉక్రెయిన్​ సైన్యాన్నే కాకుండా జనావాసాలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడుల తీవ్రత పెంచిన విషయం తెలిసిందే. రష్యా బాంబు దాడుల పట్ల  ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రశాంతమైన నగరంలో కల్లోలం సృష్టిస్తున్నారు. అక్కడి జనం ఏం తప్పు చేశారు? ఇది నిజంగా ఉగ్రవాదమే. ఈ దారుణాలను ఉక్రెయిన్ ​ కొన్నేండ్ల పాటు మరిచిపోదు. రష్యా బాలగాల విధ్వంసం చరిత్రలో యుద్ధ నేరాల కింద నిలిచిపోతుంది” అని హెచ్చరించారు. ఇప్పటి దాకా రష్యా దాడుల్లో 2,300 మంది ఉక్రెయిన్​ పౌరులు, సైనికులు చనిపోగా వేల మంది గాయపడ్డారు.

Related posts

ముష్టియుద్ధంలో చైనా తరపున ఎంత మంది చనిపోయారో తెలిసిపోయింది

Satyam NEWS

గోపాలపురంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభ

Satyam NEWS

అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తా

Satyam NEWS

Leave a Comment