27.7 C
Hyderabad
April 26, 2024 03: 27 AM
Slider ప్రపంచం

రష్యా సబ్‌మెరైన్‌ నుంచి హైపర్‌సోనిక్ క్షిపణి విజయవంతం

రష్యా మరో బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించింది. అధునాతన క్షిపణి పరీక్షను నిర్వహించింది. మొట్టమొదటిసారి హైపర్‌సోనిక్ క్షిపణిని రష్యా అణు జలాంతర్గామి నుంచి విజయవంతంగా నిర్వహించినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. సెవెరోద్‌విన్సిక్ జలాంతర్గామి నుంచి ప్రయోగించిన జిర్కోన్ క్షిపణి బారెంట్స్ సముద్రంలోని నిర్దేశిత డమ్మీ లక్ష్యాన్ని తాకిందని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.

జలాంతర్గామి నుంచి జిర్కాన్ క్షిపణిని రష్యా ప్రయోగించడం ఇది మొదటిసారి. నౌకాదళానికి చెందిన నౌక నుంచి గతంలో పలుసార్లు ఈ క్షిపణి ప్రయోగ పరీక్షలు రష్యా నిర్వహించింది. ధ్వని వేగం కన్నా ఎనిమిదిరెట్లు అధిక వేగంతో ప్రయాణించగల సామర్థ్యం జిర్కాన్ క్షిపణికున్నట్లు తెలుస్తోంది.

ఈ క్షిపణి 1,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదని, ఈ క్షిపణి ప్రవేశంతో రష్యా సైనిక సామర్థ్యం మరింత బలోపేతం కాగలదని నిపుణులు చెబుతున్నారు. రష్యా తాజాగా చేసిన టెస్ట్‌ మాత్రం వాటితో పోలిస్తే విభిన్నమైనదని డిఫెన్స్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. సుదూర లక్ష్యాలను చేధించగల క్షిపణుల తయారీకి రష్యా మొగ్గు చూపుతోంది.

Related posts

సీఎం జగన్ విజయనగరం పర్యటనకు విస్తృత బందోబస్తు

Satyam NEWS

వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

చదువుల తల్లి… ఎందుకో తెలియదు… చనిపోయింది

Satyam NEWS

Leave a Comment