40.2 C
Hyderabad
April 24, 2024 18: 07 PM
Slider ప్రపంచం

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నుంచి రష్యా అవుట్

#putin

ఉక్రెయిన్ పై అతి కిరాతకంగా యుద్ధం చేస్తున్న రష్యాను ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల మండలి నుండి సస్పెన్షన్ కు గురైంది. ఉక్రెయిన్‌లో రష్యన్ దళాల దాడి మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది.

అమెరికా నేతృత్వంలో ప్రవేశ పెట్టిన ఈ తీర్మానానికి అనుకూలంగా తొంభై మూడు దేశాలు ఓటు వేయగా, 24 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేయగా, 58 దేశాలు గైర్హాజరయ్యాయి. ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం కొనసాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘన, మానవతా సంక్షోభంపై ఐక్య రాజ్య సమితి తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది.

దాంతో రష్యాను మానవ హక్కుల మండలి నుండి సస్పెండ్ చేశారు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ తీసుకున్న ఈ నిర్ణయం పై ఉక్రెయిన్ హర్షం వ్యక్తం చేసింది.

Related posts

గ్రామీణ వైద్యులకు శాస్త్రీయమైన శిక్షణ ఇవ్వాలి

Satyam NEWS

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

Satyam NEWS

గంజాయి విక్రయదారులపై పి.డి. యాక్ట్ నమోదు చేస్తాం

Satyam NEWS

Leave a Comment