27.7 C
Hyderabad
April 26, 2024 03: 07 AM
Slider ప్రపంచం

డాక్టర్ రెడ్డీస్ నుంచి రష్యా వ్యాక్సిన్ వచ్చేస్తోంది

#RussiaVaccine

రష్యా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ను భారత్ లో పంపిణీ చేసేందుకు డాక్టర్ రెడ్డీ లేబెరెటరీ ఒప్పందం కుదుర్చుకుంది. చట్ట పరమైన అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాత రష్యా రూపొందించిన స్పూత్నిక్ వి వ్యాక్సిన్ ను డాక్టర్ రెడ్డీస్ భారత్ లో పంపిణీ చేస్తుంది.

అంతే కాకుండా ప్రస్తుతం జరుగుతున్న క్లీనికల్ ట్రయల్స్ లో తన వంతు పాత్రను నిర్వర్తిస్తుంది. రష్యన్ డైరెక్ట్ ఇన్ వెస్ట్ మెంట్ ఫండ్, రష్యా సావరిన్ వెల్త్ ఫండ్ లతో కలిసి డాక్టర్ రెడ్డీస్ ఈ బాధ్యతను స్వీకరించింది.

తొలి దశలో 100 మిలియన్ వ్యాక్సిన్ డోస్ లను రష్యా డైరెక్ట్ ఇన్ వెస్ట్ మెంట్ ఫండ్ భారత్ కు సరఫరా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

వ్యాక్సిన్ కు చట్టబద్ధమైన అనుమతులు రావడానికి, మూడో దశ క్లీనికల్ ట్రయల్స్ పూర్తి కావడానికి ఈ ఏడాది చివరి వరకూ పట్టవచ్చు. డాక్టర్ రెడ్డీస్ రష్యాలో దాదాపు 25 సంవత్సరాల నుంచి పని చేస్తున్నది.

Related posts

తిరుపతిలో అదృశ్యమైన బాలుడి కథ సుఖాంతం

Satyam NEWS

అలనాటి బాలీవుడ్ హీరో రిషి కపూర్ ఇకలేరు

Satyam NEWS

కమ్మ సామాజిక వర్గ సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తా

Satyam NEWS

Leave a Comment