33.2 C
Hyderabad
April 26, 2024 02: 05 AM
Slider ప్రపంచం

రష్యా వ్యాక్సిన్ నూటికి నూరు శాతం సేఫ్

#RussiaVaccine

రష్యా అభివృద్ధి పరచిన స్పూత్నిక్ కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని మాస్కో లోని 52 నెంబర్ ఆసుపత్రికి చెందిన ఎనస్థీసియాలజీ డిప్యూటీ చీఫ్ ఫిజీషియన్ ప్రొఫెసర్ సెర్గే సారెన్కో తెలిపారు.

మొదటి దశ, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్ సెట్ లో సెప్టెంబర్ 4 ప్రచురించామని ఆయన తెలిపారు.

మానవులలో వ్యాక్సిన్ బాగా పని చేస్తున్నట్లు తమ పరిశీలనలో వెల్లడి అయిందని ఆయన వివరించారు. రష్యాలోని గమలేయా నేషనల్ రిసెర్చి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రోబయాలజీ ఈ వ్యాక్సిన్  ను రూపొందించిన విషయం తెలిసిందే.

డాక్టర్ రెడ్డీస్ సంస్థ రష్యన్ డైరెక్ట్ ఇన్ వెస్ట్ మెంట్ ఫండ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఈ వ్యాక్సిన్ ను మన దేశంలో పంపిణీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నది.

క్లినికల్ ట్రయల్స్ లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించినట్లు చెబుతున్నారు. మరో 55 వేల మంది వాలంటీర్లు పోస్టు రిజిస్ట్రేషన్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు ముందుకు వచ్చారని, వారిపై తర్వలో ట్రయల్స్ ప్రారంభిస్తామని సంస్థ ప్రకటించింది.

ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ మాసాలలో ఈ ట్రయల్స్ ఫలితాలు వెల్లడి అవుతాయని అంచనా వేస్తున్నారు.

Related posts

క్లియర్ కట్ :శరణార్థులను ఆదుకోవడానికే సీఏఏ కిషన్‌రెడ్డి

Satyam NEWS

ఎమ్మెస్సార్ మృతి పట్ల ఆది శ్రీనివాస్ సంతాపం

Satyam NEWS

బెటాలియ‌న్ కమాండెంట్ విక్రాంత్ పాటిల్ కు అభినందనల వెల్లువ

Satyam NEWS

Leave a Comment