39.2 C
Hyderabad
April 25, 2024 17: 05 PM
Slider నల్గొండ

వివాదాస్పదమవుతున్న రైతు వేదికలు

#GoliMadhusudhanreddy

రాజకీయ వేదికలుగా మారకుండా ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకోవాలని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒక రైతు వేదిక నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నందున ప్రధాన మంత్రి ఫోటో ను రైతు వేధిక హాలు లో ఏర్పాటు చేయాలని, కెసిఆర్ 2018 ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం రైతులకు లక్ష రూపాయల ఋణ మాఫీ ని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కిసాన్ క్రెడిట్ కార్డు ను ప్రతి రైతు కి అందించాలని పంటల నమోదు కార్యక్రమం పొడిగించాలని , ప్రధాన మంత్రి ఫసల భీమా పథకాన్ని అమలు చేయాలని భూసార పరీక్షలు నిర్వహించి రైతుల అందరికీ సాయిల్ హెల్త్ కార్డులను అందించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం మెట్ల అశోక్ మరియు కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలకూరి ఎలెందర్, దళిత మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి బీపంగి జగ్జీవన్,యివమోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వంశి క్రిష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు

Related posts

ఉత్తర ద్వార దర్శనంతో పులకించిన భక్తులు

Satyam NEWS

ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి గెలిచిందే సంపాదించుకోవడానికి…

Satyam NEWS

మూడో రోజు కొన‌సాగిన విజయనగరం పోలీసుల ఆప‌రేష‌న్ ప‌రివ‌ర్త‌న్

Satyam NEWS

Leave a Comment