33.2 C
Hyderabad
April 26, 2024 01: 41 AM
Slider సినిమా

పవర్ ఫుల్ క్యారెక్టర్ లో విజయ్ అరుణ్

SAAHO-NEW

సాహో విడుదలకు సిద్ధమౌతోన్న సందర్భంలో ఒక్కో పాత్ర ను పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, శ్రద్ధా కపూర్ లుక్స్ కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు నటుడు విజయ్ అరుణ్ లుక్ ని విడుదల చేశారు. తమిళం లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో… విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ…. మంచి పేరు తెచ్చుకున్న అరుణ్ విజయ్ సాహో లో అద్భుతమైన పాత్రతో మెప్పించబోతున్నాడు. భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ప్యాక్ డ్ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంది. అలాగే అరుణ్ విజయ్ పాత్ర సినిమాలో చాలా కీలకం. ఈ పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.”Blood doesn’t need bloody invitation” అనే క్యాప్షన్ ని బట్టే ఈ క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్ గా వుండనుందో అర్థం చేసుకోవచ్చు. యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్, బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ జంట‌గా యు.వీ క్రియేష‌న్స్ ప‌తాకం పై వంశీ, ప్ర‌మోద్, విక్ర‌మ్ లు ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం సాహో. యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీ తో తెరెకెక్కుతుంది.  ఈ చిత్రం అగ‌ష్టు 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.  బాహుబలి లాంటి చిత్రం త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌టం తో రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ అంద‌రూ ఈ సినిమా పై భారి అంచ‌నాలు పెట్టుకున్నారు. దీంతో మేక‌ర్స్ ఎక్క‌డా చిన్న విష‌యం లో కూడా కాంప్ర‌మైజ్ కాకుండా ఆడియ‌న్స్ కి పూర్తి వినోదాన్ని క్లారిటి ఆఫ్ క్వాలిటి తో అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్, శ్రధ్ధాక‌పూర్‌, జాకీష‌ర‌ఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌కాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా త‌దిత‌రులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Related posts

ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలి

Bhavani

జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన బిచ్కుంద క్రీడాకారుడు

Satyam NEWS

త్వరలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు

Murali Krishna

Leave a Comment