శబరిమల ఆలయం తెరుచుకోవడంతో భక్తుల ఒక్కసారిగా పోటెత్తారు. మండల మకర విళక్కు పూజల కోసం ఆదివారం భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. వార్షిక మకర విళక్కు పూజల కోసం అయ్యప్ప దేవాలయాన్ని శనివారం తెరచారు. దీంతో ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకు గర్భగుడిని దేవాలయ ముఖ్య పూజారి నెయ్యాభిషేకం, మహా గణపతి హోమం సహా పలు ప్రత్యేక పూజలు జరిపారు. కేరళ దేవాదాయ మంత్రి కే సురేంద్రన్ ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు వాసు, బోర్డు సభ్యులు, దేవాదాయ కమిషనర్ ఎం హర్షన్ తదితరులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం, ట్రావెన్ కోర్ బోర్డు భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఆలయ పరిసరాల్లో, గుడికి వెళ్లే మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 10 మంది డీఎస్పీలు, 30 మంది ఇన్‌స్పెక్టర్లు, 120 మంది ఎస్సై/ఏఎస్సైలు, 1400 మంది కాన్‌స్టేబుళ్లను భక్తుల భద్రత కోసం సన్నిధానం వద్ద విధుల్లో ఉంచారు.
previous post