ఒడిశా లోని గంజాం జిల్లాలో బుధవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. టికిరి నుండి బస్సు బెర్హంపుర్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారని స్థానికులు చెప్పారు. తెల్లవారుజాము మూడు గంటలకు ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రదేశం అటవీ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం చుట్టూ నీరు ఉన్నందున సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్టుగా అధికారులు చెప్పారు. లోయలో బస్సు పడినందున ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. నాలుగు అగ్నిమాపక సిబ్బంది సమీప ప్రాంతాల నుండి ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. డిప్యూటీ ఫైర్ ఆఫీసర్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తప్తాని ఘాట్ జిల్లాలోని పాలుకోలా వద్ద బ్రిడ్జి నుండి లోయలోకి ఈ బస్సు పడింది.
previous post