36.2 C
Hyderabad
April 25, 2024 22: 55 PM
Slider ముఖ్యంశాలు

రాష్ట్రపతిని కలిసిన సద్గురు రమేష్‌ జీ, గురుమా

#sadguru

ఉగాది పండుగను పురస్కరించుకుని  సద్గురు రమేష్‌ జీ, గురుమా తదితరులు క్లీన్‌ ద కాస్మోస్‌ (సీటీసీ)లో ప్రచారంలో భాగంగా  భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో  కలుసుకున్నారు. విశ్వశాంతి కోసం క్లీన్‌ ద కాస్మోస్‌ (సీటీసీ) కార్యక్రమం ద్వారా  సద్గురు రమేష్‌ జీ, గురుమా చేస్తోన్న ప్రయత్నాలను రాష్ట్రపతి గుర్తించారు. క్లీన్‌ ద కాస్మోస్‌ (సీటీసీ) అనేది ఆధ్మాత్మిక మరియు దైవ ప్రచారం. మానవ జాతి సంక్షేమం కోసం సద్గురు రమేష్‌ జీ దీనిని ప్రారంభించారు. 

ప్రపంచ శాంతి, అందరూ ఒకటేనన్న భావనను  పెంపొందించాలనేది ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగామానవాళి  అతి తీవ్రమైన నెగిటివిటీతో సతమతమవుతుందిప్పుడు. ఆలోచనలు మాత్రమే కాదు భావోద్వేగాలూ కూడా అదే రీతిలో ఉంటున్నాయి. సరాసరిన, మనిషి మెదడులో రోజుకు 60–80 వేల ఆలోచనలు వస్తుంటాయి.

కానీ, వీటిలో 90% నెగిటివ్‌ ఆలోచనలే !  డిప్రెషన్‌, ఆత్మహత్యలు,  టెర్రరిజం, క్రూరమైన నేరాలు, మతపరమైన  అల్లర్లు, హింస, యుద్ధాలు, ద్వేషం, అహం వంటి వాటికి ఈ ఆలోచనలే కారణం.  మన ఆలోచనలు మనలోనే ఉండిపోవు. ఈ విశ్వంలోకి నెగిటివ్‌ ఎనర్జీనీ విడుదల చేస్తాయి. అది మరింతగా నేరాలు, ఘోరాలు, యుద్ధాలు వంటి వాటికి కారణమవుతుంది.  మరి దీనికి పరిష్కారమంటే  పాజిటివ్‌ వైబ్రేషన్స్‌తో ఈ విశ్వాన్ని నింపడం. సానుకూల అంశాలు,  ప్రార్థనలతో  పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ను విశ్వంలోకి విడుదల చేయడం ద్వారా విశ్వశాంతి స్ధాపన చేయాలనేది సద్గురు రమేష్‌జీ సంకల్పం. అందుకోసమే సీటీసీ కార్యక్రమం ప్రారంభించారు.

సద్గురు రమేష్‌జీ గురించి…

రమేష్‌ జైన్‌గా ఓ వ్యాపార కుటుంబంలో జన్మించారు సద్గురు రమేష్‌జీ, స్వామి పూర్ణానంద  జ్ఞాన బోధలతో ఆధ్యాత్మికవేత్తగా మారిన ఆయన  హఠ యోగ, కుండలిని యోగ మరియు క్రియ యోగాలో  అత్యున్నత నైపుణ్యం కలిగి ఉన్నారు.  తెలంగాణాలోని హైదరాబాద్‌కు సమీపంలో  జన్వాడ వద్ద పూర్ణ ఆనంద ఆశ్రమం  ప్రారంభించారు.

ప్రజలు సంతోషంగా జీవించడంలో సహాయపడటానికి తన జీవితం అంకితం చేసిన గురూజీ, గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా జ్ఞాన బోధనలను యూట్యూబ్‌, సోషల్‌ మీడియా ఛానెల్స్‌ తో పాటుగా సత్సంగాల ద్వారా చేస్తున్నారు.

సద్గురు రమేష్‌జీ సోల్‌ సెల్ఫీ ,  సోల్‌ మంత్ర అంటూ రెండు పుస్తకాలు రచించారు.  ఇప్పుడు క్లీన్‌ ద కాస్మోస్‌  కార్యక్రమం ద్వారా ప్రపంచ శాంతి, ఏకత్వంను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Related posts

Do my essay for me is recognized as a service that lets you hire an experienced writer to create an essay to your reward

Bhavani

విజయం ముంగిట బోల్తా పడిన శ్రీలంక

Satyam NEWS

ఓదెల రైల్వేస్టేషన్’ వశిష్ట సింహ లుక్ విడుదల

Sub Editor

Leave a Comment