38.2 C
Hyderabad
April 25, 2024 11: 17 AM
Slider హైదరాబాద్

రాష్ట్ర సగర సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

#srinivasagowd

తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ క్యాలెండర్ ను రాష్ట్ర ఎక్సైజ్ , క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి  డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. శుక్రవారం హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇతర కులాలకు భిన్నంగా సగర కులం ఏకమై ఒకే సంఘంగా ముందుకు సాగడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బిసి లలోని అన్ని కులాలకు కావాల్సిన పథకాలను అమలు చేస్తుందని, సగరులకు కులవృత్తి నిర్మాణ రంగం పై ఆధారపడ్డ జాతిగా గుర్తించి ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులలో రిజర్వేషన్ల విధానంతో ఇఎండి లు లేకుండా పనులు కేటాయించడం కేసీఆర్ ప్రభుత్వం గొప్పతనమని అన్నారు.

భవిష్యత్ లో మరిన్ని సంక్షేమ పలాలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సగర సంఘం మాజీ అధ్యక్షులు ఆర్.బి. ఆంజనేయులు సగర, రాష్ట్ర సగర మహిళా సంఘం కోశాధికారి పల్లవి సగర, రాష్ట్ర యువజన సంఘం కోశాధికారి రాము సగర, రాష్ట్ర ప్రచార కార్యధర్శి సతీష్ సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అధ్యక్షులు మోడల రవి సగర తదితరులు పాల్గొన్నారు.

Related posts

బండయప్ప స్వామి పుణ్య తిథి

Satyam NEWS

మజ్జిగ పంపిణీ చేసిన రామ్ చరణ్ అభిమానులు

Satyam NEWS

శాంతి నిలయంలో ఘనంగా దీపావళి సంబరాలు

Murali Krishna

Leave a Comment