బాహుబలి తర్వాత బాహుబలి అంతటి సినిమా అంటూ ప్రచారం చేసుకుంటున్న సాహో చిత్రం అంత మేరకు కలెక్షన్లు రాబడుతుందా? యంగ్ రెబల్ స్టార్, బాలివుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తున్న ఈ యాక్షన్ మూవీ టీజర్ అయితే దూసుకుపోయింది. కటౌట్ బాగానే ఉంది కానీ కంటెంటు ఎలా ఉంటుందనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఈ నెల 30న ఈ చిత్రం విడుదలకు అన్ని ఏర్పాట్లూ ఘనంగా జరిగిపోతున్నాయి. అన్ని భాషల్లో సినిమా ప్రమోషన్లు కూడా హడావుడిగా జరిగిపోతున్నాయి కానీ అసలు విషయానికి వస్తే సాహో చిత్రంలో కథ పెద్దగా ఉండకపోవచ్చుననే టాక్ వినిపిస్తున్నది. కథ పెద్దగా ఆసక్తి కరంగా ఉండదని కేవలం గ్రాఫిక్స్ హంగులు మాత్రమే దట్టించారని చెబుతున్నారు. స్క్రీన్ ప్లే ఎంతో స్లోగా ఉందని కూడా టాక్ వినిపిస్తున్నది. లాగ్ ఎక్కువగా ఉండేలా కనిపిస్తున్నదని అందువల్లనే చిత్రయూనిట్ గ్రాఫిక్స్ పై ఆధారపడిందని అంటున్నారు. చిత్రంలో ఎక్కడా కామెడీ కంటెంటు లేదని కూడా చెప్పుకుంటున్నారు. కామెడీ కంటెంటు లేకుండా తెలుగులో అయితే సినిమా నడవడం కష్టం. కేవలం ఛేజ్ లు ఫైట్లతో కాలం నెట్టుకురావడం తెలుగు సినిమాకు అలవాటు లేదు. ప్రభాస్,శ్రద్ధా కపూర్ ల మధ్య రొమాంటిక్ సీన్లు కూడా చిత్రంలో లేవట. అందుకోసమే జాక్వలిన్ ఫెర్నాండేజ్ పాటను చిత్రం ప్రమోట్ చేస్తున్నారని వినికిడి. తొలి వారం గడిస్తే చాలు అనుకునే మూవీలాగా సాహో ఉండబోతున్నదట. 30 వరకూ వేచి చూస్తే కానీ అసలు విషయం అర్ధం కాదు.
previous post