Slider ప్రత్యేకం సినిమా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ ప్రీరిలీజ్ 18న

prabhas-saaho-pre-release-event

ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ సాహో ట్రైలర్ ఇటీవలే విడుదలై సంచలనాలు సృష్టించింది. అత్యున్నత సాంకేతిక నిపుణులతో వరల్డ్ క్లాస్ సినిమాగా వస్తుంది సాహో. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. ఇక ఇప్పుడు ఈ వేడిని మరింత పెంచేందుకు రామోజీ ఫిల్మ్ సిటీ లో కనీ వినీ ఎరుగని రీతిలో ఈ నెల 18న ప్రీరిలీజ్ ఈవెంట్ చేయనున్నారు. ఈ వేడుక కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానులు భారీగా వచ్చే ఈ వేడుక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే హాలీవుడ్ సినిమాల స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు సుజీత్. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేశారు. ముఖ్యంగా ట్రైలర్లో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రభాస్ యాక్షన్ సీన్స్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. శ్రద్ధా కపూర్ తో రొమాంటిక్ సీన్స్ కూడా బాగా వర్కవుట్ అయ్యాయి. వాళ్ల కెమిస్ట్రీకి మంచి మార్కులు పడుతున్నాయి. ఈ సినిమా కోసం విదేశీ స్టంట్ కొరియోగ్రాఫర్లు పని చేశారు. 2 నిమిషాల 47 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్లో అన్ని ఎమోషన్స్ మిక్స్ చేశాడు దర్శకుడు సుజీత్. దుబాయ్, రొమేనియా లో తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి. వాటితో పాటు ప్రభాస్ గెటప్ కూడా అదిరిపోయింది. జిబ్రన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు అదనపు ఆకర్షణ. ఆగస్టు 30న సాహో ప్రేక్షకుల ముందుకు రానుంది.

న‌టీన‌టులు:ప్ర‌భాస్, శ్ర‌ద్ధా క‌పూర్, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజ‌య్, మందిరా బేడీ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: సుజీత్,నిర్మాత‌లు: వ‌ంశీకృష్ణా రెడ్డి, ప్ర‌మోద్ ఉప్ప‌ల‌పాటి, భూష‌ణ్ కుమార్,సంగీతం: త‌నిష్క్ బ‌గేచీ, గురు రంధ్వా,నేప‌థ్య సంగీతం: జిబ్ర‌న్,సినిమాటోగ్ర‌ఫీ: ఆర్ మ‌ది,ఎడిట‌ర్: ఏ శ్రీక‌ర్ ప్ర‌సాద్, పిఆర్ఓ: ఏలూరు శ్రీను

Related posts

కరోనా ఎలర్ట్: ఇంటి నుండి బయటికి ఎవ్వరూ రాకండి

Satyam NEWS

పట్టపగలే కొల్లగొడుతున్న మట్టి మాఫియా

Satyam NEWS

కేసుల శాశ్వతంగా కేసుల‌ పరిష్క‌రానికి లోక్ అదాల‌త్

Satyam NEWS

Leave a Comment