28.7 C
Hyderabad
April 20, 2024 09: 29 AM
Slider హైదరాబాద్

ఇదేం జమానా? బతుకమ్మ కూడా ఆడనివ్వరా??

BatukammaArrest

బతుకమ్మ ఆడాలంటే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలా? ఏం మాట్లాడుతున్నావ్ అన్నా… ఇదేమన్నా నిజాం జమానానా? తెలంగాణ అచ్చింది తెల్వదా?… అని ఎవరైనా చెబితే అతి పొరబాటే.

తెలంగాణ వచ్చినా ఇది నిజాం జమానా కాకపోయినా పోలీసులు పోలీసులే. బతుకమ్మ ఆడాలంటే పోలీసు పర్మిషన్ కావాల్సిందేనంటున్నారు సైదాబాద్ పోలీసులు.

అలా పర్మిషన్ తీసుకోకుండా మహిళలు బతుకమ్మ ఆడటం నేరమేనని సైదాబాద్ పోలీసులు అంటున్నారు. నిన్న రాత్రి సైదాబాద్ పోలీసులు చేసిన ఈ పని పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణ లో మహిళలు స్వేచ్ఛగా బతుకమ్మ కూడా ఆడుకోనివ్వరా అంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు.

రోడ్డుపై బతుకమ్మ ఆడుకోవడానికి పోలీసు పర్మిషన్ ఏమిటి అని అడిగే వారికి పోలీసులు సమాధానం చెప్పడం లేదు.

తెలంగాణ వచ్చింది ఇందుకేనా అని ప్రశ్నించే వారి ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది.

Related posts

డిజిపి గౌతమ్ సవాంగ్ ఐపిఎస్సా లేక వైపిఎస్సా ?

Satyam NEWS

భాగ్యనగరంలో క్విట్ ఇండియా స్ఫూర్తితో నిరసన

Satyam NEWS

వేంగి రాజుల కాలం నాటి చెరువును మాయం చేసిన పెద్దలు

Bhavani

Leave a Comment