34.2 C
Hyderabad
April 19, 2024 20: 25 PM
Slider ముఖ్యంశాలు

జీతాలు వచ్చేశాయి

#salary

ఎప్పుడు ఆలస్యంగా వచ్చే జీతాలు ఒకటవ తేదీనే పడటం తో పాత నల్గొండ జిల్లా లోని  ఉద్యోగ,ఉపాధ్యాయులు ఆశ్చర్య పోవాల్సి వచ్చింది. ఉప ఎన్నిక వస్తే ఏమొస్తుందనే ప్రశ్నకు సమాధానo ఇదే అని చర్చ జరుగుతున్నది. ఉపఎన్నిక వల్ల  ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాత్రం ఒకటో తేదీనే జీతాలు వస్తాయని తెలుసుకున్నారు. ధనిక రాష్ట్రమే అయినా ప్రతి నెలా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు జీతాలు పదో తేదీ వరకూ జిల్లాలవారీగా పడుతూ ఉన్నాయి. గత నెలలో కూడా ఫస్ట్ తేదీ నుంచి నాల్గవ తేదీ మధ్యలో జీతాలు పడ్డాయి. ఒకవైపు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక, దసరా పండుగ సమయంలో కూడా  ప్రభుత్వం ప్రయారిటీ ప్రకారం జీతాలు వేసింది. ఈ నెలలో కూడా అది కంటిన్యూ అయింది. ఊహకు అందని విధంగా 1వ తేదీనే జీతాలు రావటంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల ఇదేవిధంగా వుంటే బాగుంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

ప్రపంచ అవసరాలకు అనుగుణంగా పంటలు

Satyam NEWS

కడప జిల్లా జడ్పీ చైర్మన్ గా అకేపాటి ప్రమాణ స్వీకారం

Satyam NEWS

డీఎస్పీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ను అరెస్టు చేసిన ఏసీబీ

Sub Editor

Leave a Comment