39.2 C
Hyderabad
March 28, 2024 15: 25 PM
Slider శ్రీకాకుళం

గొర్రెతోక బెత్తెడులా సమగ్ర శిక్ష టీచర్ల జీతాలు

#Sarvaskisha Abhiyan

ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో విద్యార్ధులు ఉత్తమ ఫలితాలు వచ్చేలా అత్యున్నత బోధన అందిస్తున్నా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష లో ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది జీత భత్యాలు మాత్రం గొర్రెతోక చందంగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగస్తులు మొత్తం 27,000  మందికి  పైగా వివిధ విభాగాలలో గత 8 సంవత్సరాలుగా ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగస్తులు పని చేస్తున్నారు.

ముఖ్యంగా  కే.జీ.బీ.వీ  బాలికల, ఇంటర్మీడియట్ కళాశాలలో తాత్కాలిక పద్ధతిలో  అధ్యాపకులు పని చేస్తున్నారు. వీరికి నెలకు 12, 000 మాత్రమే జీతం చెల్లిస్తున్నారు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ  సంవత్సరం ఫలితాలలో 70 %నుంచి 80 % విద్యార్థులు పరీక్ష ఫలితాలలో  విజయం సాధించారు.

అదేవిధంగా సమగ్ర శిక్ష  ప్రభుత్వ పాఠశాలలో  తాత్కాలిక బోధకులు  అయిన ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయులు తమ పాఠశాలలో చదివే విద్యార్థులను జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేటట్లు చేసి అనేక పతకాలు సాధించారు. ఈ బోధకులకు గత ఐదు సంవత్సరాల నుంచి నెలకు 14,203 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగస్తుల స్థితి గమనించి పనికి తగ్గ వేతనం ఇప్పించవలసిందిగా వేడుకుంటున్నారు.

Related posts

వైసీపీ ఓటు బ్యాంకు రాజకీయాలే అసలు సమస్య

Satyam NEWS

ఉక్రెయిన్ నుండి ఖమ్మానికి చేరుకున్న విద్యార్థులు

Sub Editor 2

సముద్ర స్నానానికి వచ్చి యువకుడు గల్లంతు

Satyam NEWS

Leave a Comment