35.2 C
Hyderabad
April 20, 2024 15: 38 PM
Slider శ్రీకాకుళం

ఉద్యోగమేమో ఫుల్ టైం జీతం మాత్రం పార్ట్ టైం

#ParttimeEmployees

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి సమగ్ర శిక్ష  విభాగంలో ప్రభుత్వ పాఠశాలలో ఒప్పంద, పొరుగు సేవ పద్ధతిలో ఆర్ట్, క్రాఫ్ట్ ,వ్యాయామ విద్య బోధకులను 8 సంవత్సరముల నుంచి పని చేస్తున్నారు. 

పొరుగు సేవ లో పనిచేస్తున్న వారికి పది వేలు  రూపాయలు,  ఒప్పంద  సేవ లో పనిచేస్తున్న వారికి 14, 203 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారు. 

నిజానికి వీరికి గౌరవ వేతనం ప్రస్తుత కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి  రూ.23, 000 ఇవ్వాలని కోరుతున్నారు. అయితే వీరికి పేరుకు పార్ట్ టైం, పనిచేస్తుంది ఫుల్ టైం, జీతాలు మాత్రం పార్ట్ టైం చెల్లిస్తున్నారు.

వీరి సేవలు మాత్రం గతంలో బడి మానేసిన విద్యార్థుల సమాచారం సేకరించి తిరిగి వారిని బరిలో వీరే చేర్పించారు.

ఉదయం మధ్యాహ్నం పనులే పనులు

నాలుగు నెలల నుంచి నాడు నేడు కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరణ కార్యక్రమంలో కూడా పార్ట్టైమ్ బోధకులు రోజు పాఠశాలకు ఉదయం, మధ్యాహ్నం హాజరై  పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

ఉద్యోగం వచ్చేసరికి పార్ట్టైమ్ అని రాష్ట్ర సమగ్ర శిక్ష అధికారులు  చెప్పి వీరి చేత వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు.  వీరికి రీ ఎంగేజ్ ఉత్తర్వులు పార్ట్ టైం పేర్కొని  ఎందుకో చాలీ చాలనట్లు వేతనం ఇస్తున్నారు.

మరో విషయం ఏమిటంటే ప్రతీ ఏడాది  ఎంతో కొంత శాతం  వేతనం పెంచుతామని  సమగ్ర శిక్ష అధికారులు చెబుతున్నప్పటికీ నేటికి ఒక రూపాయి పెరగక పోవడం విశేషం.

ఇప్పటికైనా పార్ట్ టైం అనే పదమును తొలగించి ఫుల్ టైం కింద మార్చి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కోరుతున్నారు.

Related posts

నవ్యాంధ్రప్రదేశ్ ను గంజాయి ఆంధ్ర ప్రదేశ్ గా మార్చేశారు

Satyam NEWS

అందంగా తీగల వంతెన

Murali Krishna

తిరుమల కొండపై రాజ్యమేలుతున్న దళారులు

Satyam NEWS

Leave a Comment