34.2 C
Hyderabad
April 19, 2024 20: 26 PM
Slider ముఖ్యంశాలు

రక్తదానం చేసి రెండు ప్రాణాలు నిలబెట్టిన పోలీసన్న

K Srinivas

ఒక వైపు కరోనా విధులు నిర్వర్తిస్తూనే మరో వైపు ఒక ప్రాణాన్ని నిలబెట్టిన కానిస్టేబుల్ కు శాల్యూట్ చెప్పడం తప్ప మనం ఏం చేయగలం? నిర్మల్ జిల్లా పోలీస్ బ్లూ కోల్డ్ కానిస్టేబుల్ K.శ్రీనివాస్ ఈ మహత్కార్యం చేసి ఆదర్శంగా నిలిచాడు.

ఖానాపూర్ మండలం సింగపూర్ తండా కు చెందిన బనవత్ జ్యోతి నిండు నెలల గర్భిణిగా స్థానిక ప్రసూతి ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు డెలివరీ చేయాలంటే రక్తం అవసరం అవుతుంది. ఏం చేయాలి? ఆసుపత్రి అధికారులు ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పారు.

B పాజిటివ్ రక్తం అవసరం కాగా స్థానిక నిర్మల్ బ్లూ కోల్డ్ కానిస్టేబుల్ K. శ్రీనివాస్ ముందుకు వచ్చాడు. నాదీ అదే గ్రూప్ నేను రక్తం ఇస్తాను అంటూ అతను సిద్ధ పడ్డాడ్డు. దాంతో కానిస్టేబుల్ నుంచి రక్తం సేకరించి జ్యోతికి ఆపరేషన్ చేసి బిడ్డను, తల్లిని బతికించారు డాక్టర్లు.

కరోనా మహమ్మారి సమయంలో భార్య బిడ్డలని ఇంట్లోనే వదిలేసి రాత్రి పగలు తేడా లేకుండా ప్రజల ప్రాణాలని కాపాడుతూ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కూడా శ్రీనివాస్ ఈ విధంగా చేయడం హర్షణీయం. అత్యవసర సమయంలో ఆన్ డ్యూటీ లో ఉండి కూడా రక్తదానం చేయడం చాలా గొప్ప విషయమని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎంతో గర్వకారణం అని పలువురు అభినందించారు.

ఈ కార్యక్రమంలో సహారా యూత్ సొసైటీ స్థాపకుడు ఇర్షాన్, టౌన్ ప్రెసిడెంట్ అజర్ ఖాన్, నిర్మల్ ప్రెస్ రిపోర్టర్ రామకృష్ణ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రాకేష్, సుధాకర్ లు పాల్గొన్నారు.

Related posts

ఆటో కార్మికులకు ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలి

Satyam NEWS

చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని సైకిల్ యాత్ర

Satyam NEWS

వైయస్సార్ వాహనమిత్ర కార్యక్రమం లో మంత్రి ఆర్కే రోజా

Satyam NEWS

Leave a Comment