35.2 C
Hyderabad
April 20, 2024 17: 59 PM
Slider మహబూబ్ నగర్

సిపిఎస్ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లండి

#MLAKollapur

సిపిఎస్ సమస్యను  ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి వెంటనే పరిష్కరించాలని టీఎన్జీవో కొల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు  నసీర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

మంగళవారం గణతంత్ర దినోత్సవ వేడుకల అనంతరం కొల్లాపూర్ కేఎల్ ఐ అతిథిగృహంలో టీఎన్జీవో సభ్యులు టిఎస్ సిపిఎస్ ఈయు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఆర్డీవో హనుమానాయక్ హాజరయ్యారు. వారి చేతుల మీదుగా క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా టీఎన్జీవో సభ్యులు తమ సమస్యలపై మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న అన్ని ఉద్యోగ సమస్యల్లో జఠిలమైన ,జీవన్మరణ సమస్య సిపిఎస్ అన్నారు.

సిపిఎస్ రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి తమ జీవితాలకు భరోసా కల్పించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని టీఎన్జీవో డివిజన్ అధ్యక్షులు నసీర్,జిల్లా నాయకులు ఎమ్మెల్యే ను  కోరారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగులు ఎవరు అధైర్య పడవద్దని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే విధంగా సానుకూలంగా ఉన్నారన్నారు.

ముఖ్యమంత్రి దృష్టికి   సమస్య తీసుకెళ్తానన్నారు. సమస్యలు చెప్పుకోవడంలో తప్పు లేదన్నారు. పరిష్కరించే బాధ్యత ప్రభుత్వాన్నిదన్నారు.

ప్రభుత్వంచే సెలెక్ట్ అయిన ఉద్యోగులు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కలిస్తేనే అభివృద్ధి  సాధ్యమవుతుందన్నారు.

అంతకుముందు ఆర్ డి ఓ హనుమానాయక్ మాట్లాడారు. ఉద్యోగుల లో ఉన్న అంకిత భావం ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనకు, ఈనాటి సుపరిపాలనకు కారణమన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గణేష్,వరప్రసాద్, రబ్బానీ పాష, ప్రచార కార్యదర్శి షఫీ,  పసుల సత్యనారాయణ యాదవ్, తహశీల్దార్ లు ఇక్బాల్, రమేష్,

సంఘ సభ్యులు శ్రీనివాస్ ,రాజేశ్వర్,చందు,వెంకటేష్,రమణబాబు,అనిత, బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్, కొల్లాపూర్

Related posts

హత్య కేసును విజయవంతంగా ఛేదించిన కామారెడ్డి పోలీసులు

Bhavani

సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపు రద్దు

Bhavani

ఉదయం ఏజన్సీ ఏరియాలో…సాయంత్రం జిల్లా కేంద్రంలో…!ఎవరంటే…?

Satyam NEWS

Leave a Comment