27.7 C
Hyderabad
April 26, 2024 04: 00 AM
Slider గుంటూరు

రైతాంగ సమస్యల పరిష్కారమే రైతుసదస్సు ధ్యేయం

#rompicherla

రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల  పరిష్కారమే రైతు సదస్సు ధ్యేయమని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అన్నారు. రొంపిచర్ల లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం రైతు సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న వివేక్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి  ఆదేశాల మేరకు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

దీనిలో భాగంగా  ఈ మండలంలో రైతులు ఎదుర్కొంటున్న వెబ్ లాండ్ ఈ -క్రాప్  బుకింగ్ రైతు భరోసా పథకం సి సి ఆర్ సి కార్డులు తదితర సమస్యల పరిష్కారం కొరకు రైతు సదస్సును ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రెవెన్యూ వ్యవసాయశాఖల అధికారులు సమన్వయంగా  పనిచేసి రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

రైతుల పొలాలు వెబ్ ల్యాండ్ ఈ-క్రాప్ బుకింగ్ రైతుభరోసా పధకం వర్తింపులో  ఇబ్బందులు పెడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేయలేనివిధంగా  ముఖ్యమంత్రి జగన్ రైతాంగ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తున్నారని అన్నారు.

ఈ మండలంలో రైతు సదస్సు ఏర్పాటు చేయటం రాష్ట్రంలోనే ప్రధమముఅని అన్నారు. ఈ పార్లమెంటు పరిధిలో గల అన్ని మండలాల్లో రైతు సదస్సులను ఏర్పాటు చేసి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.

రెవిన్యూ వ్యవసాయశాఖల అధికారులు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన వెబ్ ల్యాండ్ ఈ క్రాప్ బుకింగ్ రైతు భరోసా పథకం వర్తింపు పై దృష్టి సారించి పరిష్కరించాలని ఆదేశించారు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ మండలంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపరిష్కారం కొరకు రైతు సదస్సును ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు.మండలంలో గత ఏడాది 49 వేల ఎకరాలలో పంటలు సాగు చేయగా ఈ క్రాప్ బుకింగ్ 30 వేల ఎకరాలలో మాత్రమే జరిగిందని అన్నారు.10 వేల ఎకరాలలో ఈ క్రాప్ బుకింగ్ జరగలేదని అన్నారు.

రైతులు పండించిన పంటలు అమ్ముకునేందుకు ఈ క్రాప్ బుకింగ్ తప్పని సరి అని అన్నారు.రైతులు పండించిన పంటలు బయట మార్కెట్లో కంటే మార్కెట్ యార్డులలో అమ్ముకుంటే ప్రయోజనము ఉంటుందని అన్నారు.

రైతులు ఎద్కురొంటున్న వెబ్ ల్యాండ్ భూ సర్వే తదితర సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు.రైతుసదస్సు ఏర్పాటు సహకరించిన జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులకు కుతజ్ఞతలు తెలిపారు.

రైతుసదస్సులో రైతులు ఎదుర్కొంటున్న వెబ్ ల్యాండ్ భూసర్వే తదితర సమస్యలపై అధికారులకు ఆర్జీలు అందజేశారు.అనంతరము అర్హులైన కౌలు రైతులకు సిసిఆర్ సి కార్డులు పంపిణీచేయటం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఆర్ డిఓ పార్దసారధి తహశీల్దార్ జాన్ సైదులు ఎండిఓ బి.అర్జునరావు వ్యవసాయశాఖ ఎడిఎ మస్తానమ్మ ఎఓ బి.శ్రీనివాస నాయక్ గ్రామ సర్పంచ్ జయమ్మ మాజీ సర్పంచ్ గెల్లి చినకోటిరెడ్డి వైసిపి నాయకులు రెవెన్యూ వ్యవసాయశాఖల సిబ్బంది రైతులు పాల్గొన్నారు.    

Related posts

రైతు కుటుంబాన్ని ఆదుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Satyam NEWS

రండి రండి ప్లవ గారూ!

Satyam NEWS

చంద్రబాబును కలిసిన ఆమంచి కృష్ణ మోహన్ ?

Satyam NEWS

Leave a Comment