సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి కి తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండలి కమిటిలో ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానం దక్కింది.
ఈ సందర్భంగా హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ సభ్యులు సాముల రామిరెడ్డి ని ఆదివారం ఆయన నివాసంలో గజమాల తో,శాలువాలతో న్యాయవాదులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండలి కమిటిలో ప్రత్యేక ఆహ్వానితునిగా స్థానం దక్కటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నారపరాజు శ్రీనివాసరావు, చేన్నగాని యాదగిరి, బట్టుపల్లి ప్రవీణ్,రమణారెడ్డి,సురేష్ నాయక్,అంజయ్య,నర్సింగ్ సతీష్,కుక్కడపు బాలకృష్ణ,సిహచ్.కృష్ణయ, వి.జి.కె మూర్తి,ఉదారి యాదగిరి,చంద్రయ తదితరులు పాల్గొన్నారు.