34.2 C
Hyderabad
April 19, 2024 19: 02 PM
Slider వరంగల్

అనారోగ్యంతో ఉన్న యువన్ కు 45 వేల ఆర్ధిక సహాయం

#SamataFoundation

ములుగు జిల్లా వాజేడు మండలం అరుణాచలపురం గ్రామానికి చెందిన 3 సంవత్సరాల బాబు సప్పిడి యువన్ ఆరు నెలలుగా లివర్ వ్యాధితో బాధపడుతూ లివర్ మార్పిడి ఆపరేషన్ కోసం హైదరాబాద్ అపోలో (జూబ్లిహిల్) ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు.

ఆ కుటుంబం ఆర్ధిక పరిస్థితిని గమనించిన సమతా ఫౌండేషన్  దాతలు అందించిన 45 వేల నగదును ఆర్ధిక సహాయంగా అందించింది. యువన్ తల్లి కవితకు ఈ సాయాన్ని అందజేసి అన్ని విధాల ఆదుకుంటామని భరోసానిచ్చారు. 

అంతకుముందే యువన్ లివర్ మార్పిడి ఆపరేషన్ కు 27 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్లు తెలిపగా దాతలు ముందుకు వచ్చి ఆర్ధిక సహాయం అందించారని దుర్గం నగేష్ తెలిపారు. అదే విధంగా ఆపరేషన్ ఖర్చుల్లో సగం ఖర్చు అందిస్తామని తెలిపిన సినిమా నటుడు సోనూసూద్ కు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు దుర్గం విశ్వనాధ్ , యువన్ తండ్రి సప్పిడి, శ్రీనివాసరావు, కొండగొర్ల సంజీవరావు, సప్పిడి రమేష్ లు ఉన్నారు.

Related posts

బిజెపి పాలిత రాష్ట్రాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది

Satyam NEWS

అధికారులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి

Satyam NEWS

తెలంగాణ ప్రజా సేన, నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ రవీందర్ కి సన్మానం

Satyam NEWS

Leave a Comment