27.7 C
Hyderabad
April 25, 2024 10: 13 AM
Slider శ్రీకాకుళం

కేజీ బియ్యం ఒక్క రూపాయి…. కేజీ ఇసుక రెండు రూపాయలు

#Srikakulam Sand Mafia

రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ప్రజలకు ఉచితంగా అందించాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా, ఆచరణలో సాధ్యం కావడం లేదు. ప్రభుత్వం మొదటి నుండి కూడా సరియైన విధానంతో వ్యవహరించకపోవడం వలన ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చెప్పినా క్రింద నున్న వ్యవస్థ క్రియాశీలకంగా వ్యవహరించకపోవడం వలన నిర్మాణదారులు ఇసుక దొరక్క మాఫియా చేతుల్లో ఇరుక్కుపోవలసివస్తుంది.

ప్రభుత్వానికి ఒక్కరూపాయి కూడా చెల్లించకుండా నాటుబళ్లు టన్ను ఇసుక 1500 రూపాయనుండి 2 వేల రూపాయల వరకు అమ్ముతున్నారు. పొన్నాడ బ్రిడ్జి, ఆర్ట్స్ కాలేజీ రోడ్, డే & నైట్ జుంక్షన్ ప్రాంతాలలో రాత్రి రెండు గంటల నుండి ఉదయం 10 గంటల వరకు నదీ గర్భాన్ని ఇసుక మాఫియా దోచేస్తున్నా ఎవ్వరు పట్టించుకోవడం లేదు.

ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఆదాయ కట్టకుండా నిర్మాణదారులను నిలువు దోపిడీ చేస్తున్న నాటు బళ్ల ఇసుక మాఫియా పై పోలీస్ అధికారులు,జిల్లా అధికారులు దృష్టి సారించి దోపిడీ ని అరికట్టే విదంగా బండి ధర అధికారులే నిర్ణయించి నిర్మాణ దారుడికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలి.

Related posts

టీఎస్ జేఏ ప్రధమ వార్షికోత్సవానికి మంత్రి జగదీశ్ రెడ్డి కి ఆహ్వానం

Bhavani

తిరుపతి కొండపై ధర్మారెడ్డికే పూర్తి బాధ్యతలు

Satyam NEWS

రైతు ఆత్మహత్య ప్రభుత్వ హత్యే: మాజీ మంత్రి షబ్బీర్ అలీ

Satyam NEWS

Leave a Comment