28.2 C
Hyderabad
April 20, 2024 12: 49 PM
Slider వరంగల్

ఇసుక రీచ్ లు అర్హమైన సొసైటీలకు మాత్రమే కేటాయించాలి

#mulugu collector

ములుగు జిల్లాలో గోదావరి నది ప్రాంతం లోఇసుక 8 రిచ్ లను, రైతుల పట్టా భూములకు సంబంధించిన  వారి  దరఖాస్తు ల మేరకు 6  ఇసుక  రీచ్ లను గుర్తించామని జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య తెలిపారు.

ఈ భూములను తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి అప్పగించామని అన్నారు. ఈ రోజు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్సు హలు లో జిల్లా స్థాయి ఇసుక కమిటి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ సంఖ్యలో సొసైటీలు ఏర్పడుతున్నందున గిరిజనుల ఆర్థిక అభివృద్ధి కి భంగం కలుగుతుందని, ఒక గ్రామం ఒక సొసైటీ అనే నిదానం తో ఏకగ్రీవంగా సొసైటీలు ఏర్పడాలని కలెక్టర్ సూచించారు.

తద్వారా గిరిజనులకు గ్రామాలు అబివృద్ది చెందుతాయని  అన్నారు. ఇసుక క్వారీ ల అర్హత కలిగిన సొసైటీలను గుర్తించేందుకు పిస్సా గ్రామ సభలు ఏర్పాటుచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మానస పల్లి ఇసుక రీచ్ పనులకు  ఫారెస్ట్ అధికారులు  అభ్యంతరాలు తెలిపినందుకు, వారికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరగా  అందజేయవల సిoదిగా జిల్లా కలెక్టర్ ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని మైనింగ్ ఎ.డి.రఘు బాబు ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, జిల్లా అదనపు ఏఎస్పీ సాయి చైతన్య, జిల్లా ఫారెస్ట్ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి, డిఆర్ఓ రమాదేవి, డిసిఓ విజయ్ భాస్కర్ రెడ్డి, టిఎస్ఎండి  ఐ.రవి, డిపిఓ వెంకయ్య, గ్రౌండ్ వాటర్ ఎ.డి.కిరణ్ సంబందిత అధికారులు పాల్గొన్నారు.

కె.మహేందర్ గౌడ్, సత్యం న్యూస్

Related posts

16 నుంచి శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

ఒకరికి కరోనా వచ్చిందని తెలియగానే మిగతా వారు ఏం చేయాలి?

Satyam NEWS

ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన దీక్ష

Satyam NEWS

Leave a Comment