35.2 C
Hyderabad
April 24, 2024 12: 49 PM
Slider ప్రత్యేకం

కొల్లాపూర్ లో పట్టుబడిన ఇసుక ట్రాక్టర్లు

#kollapur

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రేంజ్ పరిధిలో భారీ ఎత్తున ఇసుక ట్రాక్టర్లు పట్టుబడ్డాయి. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అటవీశాఖ అధికారులకు సమాచారంతో అక్కడికి చేరుకొని చాకచక్యంగా వాటిని పట్టుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కొల్లాపూర్ మండలం మొల్ల చింతలపల్లి పరిధిలో ఆదివారం రాత్రి  ఇసుక తరలించడానికి ప్రయత్నాలు చేసిన 6 ట్రాక్టర్లను మొల చింతలపల్లి డిపోకు తరలించినట్లు కొల్లాపూర్ అటవీశాఖ అధికారి (రేంజర్) శరత్ చంద్ర రెడ్డి  తెలిపారు. 6ట్రాక్టర్లు సీజ్ చేసినట్లు చెప్పారు.వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాట్లు తెలియజేశారు. అదేవిధంగా హెడ్ కోటర్ కు ఈ రోజు అయిన, రేపైనా తరలిస్తామని చెప్పారు. కేసులు నమోదు చేసినట్లు కూడా తెలిపారు.

పెరిగిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలు

ఇల్లు కట్టుకోవాలంటే ఎవ్వరికైనా ఇసుక అవసరమే. వాటి కోసం ఉన్నత అధికారులు ప్రత్యేక చట్టాలు తెచ్చారు. ఈ చట్టాలను ఇసుక మాఫియా గ్యాంగ్ ఉల్లంఘిస్తుంది. అధికార పార్టీ నాయకులు అండదండలతో విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తున్నారు. ప్రభుత్వ సంపదకు గండి కొడుతున్నారు. అధికారుల అనుమతులు లేకుండా ఇల్లీగల్ గా దందాలు చేస్తూ,అండగా వున్న వారికి కమిషన్ లు ఇస్తూ లక్షలకు పడగ విప్పితున్నారు. ఇదివరకు ఇసుక మాఫియాకు పాల్పడినవారు అధికార  నాయకుడి పక్షాన చేరారు. ఇక వారిధి ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది పరిస్థితి. ఏదేమైనా ఇసుక మాఫియా ఆరోపణలతో అధికారంలోకి వచ్చిన నాయకులు ఇప్పుడు ఇసుక మాఫియా పాల్పడే వారిని పెంచి పోషిస్తున్నారని మాటలు వినిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇసుక తరలింపులు ఇష్టానుసారంగా జరుగుతున్నాయి. కొన్ని ప్రదేశాలలో ఇది వరకు ఇసుక డంపులు వేసి తరలించారు. ప్రశ్నించిన వారిపై అధికార నాయకుని అండ దండలతో అక్రమ కుట్రలకు తెలుపుతున్నారు. అంతేకాదు ఈ మధ్యలో కొల్లాపూర్ మండలం ముక్కిడి గుండం  ప్రాంతంలో అక్రమంగా ఇసుకను  తరలిస్తున్న ట్రాక్టర్ ను అడ్డుకో పోయిన ఫారెస్ట్ అధికారుల పై దురుసుగా ప్రవర్తించించారు. వారు అధికార పార్టీకి చెందిన వారు కాబట్టి  వహనని మీదికి తెచ్చారు అని మాటలు వినిపించాయి. వాటిపై బాధిత ఆ శాఖ సిబ్బంది ఫిర్యాదు కూడా చేశారు. ఇది కొల్లాపూర్ ప్రాంతంలో జరుగుతున్న ఇసుక మాఫియా ఆగడాలు.

హెచ్చరిస్తున్న కొల్లాపూర్  రేంజర్ శరత్ చంద్ర రెడ్డి

కొల్లాపూర్ రేంజర్ గా బాధ్యతలు తీసుకున్న శరత్ చంద్ర రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. అటవీ ప్రాంతం నుండి అక్రమంగా ఇసుక, అటవీ సంపద ను తరలింపు చేసినట్లు అయితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎంతటివారైన  ఉపేక్షించేది లేదనీ అంటున్నారు.

Related posts

గిరిజన కుటుంబాలకు 25.16 లక్షల దోమతెరలు

Sub Editor

హైకోర్టు వ్యాఖ్యల దృష్ట్యా సజ్జలను ఏదో ఒక పదవికి పరిమితం చేయండి

Satyam NEWS

నల్లగార్లపాడు రోడ్డు మరమ్మత్తులకై నిరసన దీక్ష చేపడతాం

Satyam NEWS

Leave a Comment