27.7 C
Hyderabad
April 20, 2024 01: 42 AM
Slider శ్రీకాకుళం

పోరాడి విజయం సాధించిన ఇసుక ఎడ్లబండ్లు కార్మికులు

#Sand Transport

శ్రీకాకుళం పట్టణంలో పోరాడి విజయం సాధించిన ఇసుక ఎడ్లబండ్లు కార్మికులకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు,జిల్లా ఉపాధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు, జిల్లా నాయుకులు టి.తిరుపతిరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంతెన.హరనాథ్ అభినందనలు తెలియజేసారు.

గురువారం శ్రీకాకుళం సిఐటియు కార్యాలయంలో ఇసుక ఎడ్లు బండ్లు కార్మికుల విజయోత్సవ సభ జరిగింది. ఈ సభలో వారు మాట్లాడుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో యూనియన్ ప్రతినిధి బృందం కలెక్టర్ ను కలిసి ఇసుక ఎడ్ల బండ్లుకు అనుమతి ఇచ్చిందని తెలిపారు.

కార్మికులకు ఉపాధి కల్పించాలని సమస్య వివరిస్తే సానుకూలంగా స్పందించి ఇసుక ఎండ్ల బండ్లు కార్మికులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి ఇసుక ఎండ్ల బండ్లుకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ అనుమతులు ఇచ్చారని తెలిపారు. అందుకు కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు.

శ్రీకాకుళం పట్టణంలో తరతరాలుగా ‌గత 50 సంవత్సరాలుగా ఎడ్లబండ్లుతో నాగావళి నదిలో ప్రకృతి సహజంగా లభించే ఇసుక తోలుకుని కార్మికులు ఉపాధి పొందుతున్నారని, ఎండ్ల బండ్ల కార్మికులపై ఆంక్షలు విధించి కేసులు పెట్టి ఎడ్ల బండ్లు ఆపేయడంతో ఉపాధి లేక 300 ఎడ్లు బండ్లు కార్మికుల తీవ్ర  ఆర్ధిక ఇబ్బందులు పడ్డారని అన్నారు.

ఇసుక ఎడ్లు బండ్లుపై ఆంక్షలు ఎత్తివేసి ఇసుక ఎడ్లు బండ్లు కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇసుక ఎండ్ల బండ్లు కార్మికులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసారు. ఇసుక ఎడ్ల బండ్లు కార్మికుల సమస్యలు పరిష్కారానికై ఐక్య పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఈ సభలో అసిరితల్లి ఎడ్ల బండ్లు కార్మిక సంఘం నాయుకులు సి.హెచ్.శ్రీనివాస్, ఎస్.వెంకటరమణ, ఏ.సాయి, ఏమ్. శ్రీను, కె.పోలయ్య, వి.సోమేశ్వరరావు, ఎస్.రాము, ఎ.రామారావు, నక్క.ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సేవాలాల్​ స్పూర్తిగా అధ్యాత్మిక మార్గంలో పయనించాలి

Satyam NEWS

మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి

Bhavani

జూలై 10న ముగియనున్న యుద్ధ‌కాండ పారాయ‌ణం

Satyam NEWS

Leave a Comment