39.2 C
Hyderabad
April 25, 2024 16: 19 PM
Slider సినిమా

సందీప్ మాధ‌వ్ హీరోగా స‌రికొత్త రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌

#SandeepMadhav

‘వంగ‌వీటి’, ‘జార్జి రెడ్డి’ లాంటి బ‌యోపిక్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన యువ న‌టుడు సందీప్ మాధ‌వ్‌, ఈసారి ఒక స‌రికొత్త రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో మ‌న ముందుకు రానున్నారు.

హ‌ల్సియ‌న్ మూవీ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 1గా సినిమాటోగ్రాఫ‌ర్ అరుణ్ కుమార్ సూర‌ప‌నేని నిర్మాణంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనున్న‌ది.

ఈ మూవీతో జె.వి. మ‌ధుకిర‌ణ్ ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆయ‌న గ‌తంలో డైరెక్ట‌ర్ కె.ఎస్‌. ర‌వీంద్ర (బాబీ) రూపొందించిన చిత్రాల‌తో పాటు ప‌లు చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేశారు.

అలానే ఈ చిత్రంలో ఒక పవర్‌ఫుల్ రోల్‌లో ప్రముఖనటుడు నటించబోతున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర‌ నిర్మాత తెలియచేశారు.

Related posts

నదీ జలాల వివాదం పరిష్కరించుకుంటేనే మేలు

Satyam NEWS

AP Special: దేశంలోనే తొలిసారి గ్యాస్ సిలెండర్ లో గంజాయి స్మగ్లింగ్

Satyam NEWS

ఏ కంపెనీ వ్యాక్సిన్ ఏ దశలో ఉందో తెలుసా?

Satyam NEWS

Leave a Comment