మాజీ భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఏడాది క్రితం పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకున్న సానియా ఇప్పుడు ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చింది. దుబాయ్ లోని తన ఇంటిపై షోయబ్ మాలిక్ పేరును సానియా తీసేసింది. దాని స్థానంలో తన కుమారుడు ఇజాన్ పేరు పెట్టారు. ప్రస్తుతం యూఏఈలో ఉంటున్న ఆమె ఇజాన్‌తో కలిసి కొత్త విల్లాలోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. విల్లా దాదాపుగా పూర్తయింది.
సానియా మీర్జా, షోయబ్ మాలిక్ 2010లో హైదరాబాద్‌లో పెళ్లి చేసుకున్నారు. 2018లో వారు తమ కుమారుడు ఇజాన్ కు జన్మనిచ్చారు. అయితే, వారి సంబంధంలో తేడాలు 2022లో స్పష్టంగా కనిపించాయి. చివరికి, అది వారి విడాకులకు దారితీసింది. జనవరి 2024లో, పాకిస్తానీ క్రికెటర్ షోయబ్, నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ నటి గతంలో అంటే 2023లో పాకిస్థానీ గాయకుడు ఉమైర్ జస్వాల్‌ను వివాహం చేసుకుంది. సానియా మీర్జా 2023లో తన 20 ఏళ్ల టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలికింది.