టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇంట్లో శుభకార్యం జరగబోతున్నది. సానియా మీర్జా చెల్లెలు అనమ్ మీర్జా వివాహం నిశ్చయం అయింది. అనమ్ వివాహం ఎవరితోనో కాదు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ తో ఆమె వివాహంన జరగబోతున్నది. ఈ విషయాన్ని సానియా మీర్జా ధృవీకరించింది. సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే కాగా తన చెల్లెలికి కూడా క్రికెటర్ కుమారుడితో వివాహం జరిపిస్తుండటం విశేషం. డిసెంబర్ లో వీరిద్దరి వివాహం జరగబోతున్నది. ప్యారిస్ లో బ్యాచులర్స్ ట్రిప్ పూర్తి చేసుకుని ఇండియా వచ్చిన వారు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. నా చెల్లెలు ఒక మంచి అబ్బాయిని పెళ్లాడబోతున్నది. అతను మహ్మద్ అజారుద్దీన్ కుమారుడు అసద్ అంటూ సానియా మీర్జా ట్విట్ చేసింది
previous post
next post