29.2 C
Hyderabad
October 13, 2024 15: 31 PM
Slider కృష్ణ

వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశుభ్రత అవసరం

#ministerkolusupardhasaradhi

వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసుపార్ధ సారధి ఆదేశించారు. నిరంతర పారిశుద్ధ్య చర్యలు చేపట్టి కాలనీలు పరిశుభ్రంగా ఉంచాలని కూడా అధికారులను ఆదేశించారు. విజయవాడలోని 32,52 డివిజన్లలో శుక్రవారం ఆయన పర్యటించి బాధితులకు ఆహారం పాలు పంపిణీ చేశారు. అలాగే ఫైర్ ఇంజిన్ నీటితో పరిసరాలను శుభ్రం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో శానిటేషన్ నిరంతరం జరగాలని,కాలనీలను పరిశుభ్రంగా ఉంచాలని  అధికారులను ఆదేశించారు. వరద దెబ్బతిన్న ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలని,మందులు,ఇతర మెడికల్ కిట్లతో వైద్య బృందాలు సిద్ధంగా ఉండాలని మంత్రి పార్థసారథి వైద్య అధికాలను ఆదేశించారు.

బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. వరదల  కారణంగా కాలనీల్లో పేరుకు పోయిన చెత్తను వెంటనే తొలగించాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికి వరద నీటిలో ఉన్న కాలనీలలో నీటిని బయటకు పంపటానికి అధికారులు చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు. అమరావతి కాలనీ,సుందరమ్మ దిబ్బ,ఊర్మిలా నగర్ ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ప్రభుత్వం ఆండగా ఉంటుందని భరోసానిచ్చారు. భాదితులకు ఆహారం,పాలు, బిస్కెట్స్ మంచి నీరు పంపిణీ చేశారు.

Related posts

పొలిటికల్‌ రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తాం

Satyam NEWS

హుజుర్ నగర్ ఆటో వర్కర్స్ యూనియన్ ఎన్నిక

Satyam NEWS

కంచరపాలెంలో రౌడీషీటర్ దారుణ హత్య

Satyam NEWS

Leave a Comment